‘డోరతీ’ సినిమా చూసి చాలా సర్‌ప్రైజ్‌ అయ్యా: రానా దగ్గుబాటి

- September 30, 2026 , by Maagulf
‘డోరతీ’ సినిమా చూసి చాలా సర్‌ప్రైజ్‌ అయ్యా: రానా దగ్గుబాటి

కీర్తి సురేష్, సనంత్, రిషికాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘డోరతీ’. యూనిక్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి కార్తిక్ సుబ్బరాజ్ రచన, దర్శకత్వం వహించారు. జ్యోతి దేశ్‌పాండే, గునీత్ మోంగా కపూర్, అచిన్ జైన్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే తమిళనాట సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ద్వారా ‘డోరతీ’ అక్టోబర్ 2న తెలుగులో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది. 

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రానా దగ్గుబాటి మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. ‘డోరతీ’ సినిమా గురించి నెల రోజుల క్రితం కార్తీక్ నాకు ఫోన్ చేసి చెప్పాడు. టైటిల్ కొత్తగా అనిపించింది. వచ్చి సినిమా చూడమని చెప్పారు. ఈ సినిమా గురించి నాకు పెద్దగా ఏమీ తెలియదు. కీర్తి సురేష్ ఉందని మాత్రమే తెలుసు. వెళ్లి సినిమా చూశాను. సినిమా చూస్తున్నప్పుడు ఇంటర్వెల్‌కి వచ్చేసరికి ఒక్కసారిగా కథ మొత్తం మారిపోయింది. అసలు ఎలాంటి కథ తీసుకున్నాడు అనిపించింది. మొదట భయమేసింది, ఆ తర్వాత చాలా ప్రౌడ్‌గా అనిపించింది. రజనీకాంత్ లాంటి సూపర్‌స్టార్‌తో సినిమా చేసిన దర్శకుడు ఇలాంటి కథను కూడా ఎంచుకుని సినిమా చేయడం నిజంగా చాలా సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. మనం సాధారణంగా మాట్లాడుకోలేని కొన్ని అంశాలను ఈ సినిమాలో చాలా బ్యూటిఫుల్‌గా చెప్పారు. అందుకే ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చాను. ఇది చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్. మన సొసైటీని అర్థం చేసుకునేలా చేసే సినిమా. సినిమా చూసి నేను కదిలిపోయాను. ఇద్దరు హీరోలు కూడా చాలా అద్భుతంగా చేశారు. వారి ఫ్రెండ్‌షిప్‌తో మనందరం ట్రావెల్ అవుతాం. సినిమా చూస్తున్నప్పుడు చాలా రియల్‌గా అనిపిస్తుంది. కార్తీక్ ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను. అక్టోబర్ 2న సినిమా రిలీజ్ అవుతోంది. ఆ రోజు హాలిడే కూడా ఉంది. అందరూ హ్యాపీగా థియేటర్లకు వెళ్లి సినిమా చూడండి. అందరికీ థాంక్యూ.

డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘డోరతీ’ నాకు చాలా స్పెషల్ ఫిలిం. ఎందుకంటే ఇది నా మనసుకు చాలా దగ్గరైన కథ. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే తమిళనాడులో రిలీజ్ తర్వాత ప్రేక్షకులు సినిమాను చాలా గొప్పగా ఆదరిస్తున్నారు. థియేటర్లలో చాలా ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న రానా గారికి థాంక్యూ. తెలుగు ఆడియన్స్ రెస్పాన్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. అక్టోబర్ 2న సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్లలో చూడాలి. తప్పకుండా ఈ సినిమా మీకు చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. సినిమాకు సపోర్ట్ చేస్తున్న రానా గారికి మరోసారి థాంక్యూ. సినిమా చూసిన తర్వాత తప్పకుండా రిలీజ్ చేస్తామని ఆయన చెప్పడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. నా తొలి సినిమా ‘పిజ్జా’ నుంచి తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు. ఈ సినిమా కూడా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.

రిషికాంత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇలాంటి గొప్ప సినిమా చేసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ గారికి థాంక్యూ. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న రానా గారికి కూడా ధన్యవాదాలు. తమిళనాడులో ఈ సినిమాకు ఇప్పటికే అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అదే ప్రేమను తెలుగు ప్రేక్షకులు కూడా అందిస్తారని నమ్ముతున్నాను. తెలుగులో ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. భవిష్యత్తులో తెలుగులో కూడా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.

సనంత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా నాకు చాలా స్పెషల్. అదృష్టం ఉంటేనే ఇలాంటి సినిమాల్లో నటించే అవకాశం వస్తుంది. తమిళంలో ఈ సినిమా అద్భుతంగా ఆడుతోంది. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో కూడా సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. అక్టోబర్ 2న సినిమా తెలుగులో విడుదలవుతోంది. తమిళంలో ప్రేక్షకులు అందించిన ప్రేమను తెలుగులో కూడా అందిస్తారని కోరుకుంటున్నాను. ఇది ఇండియన్ సినిమాలో ఒక ఇంపార్టెంట్ ఫిలిం అవుతుందని భావిస్తున్నాను. ఈ సినిమాకు మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాను రానా గారు తెలుగులో రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇందులో నా క్యారెక్టర్‌కు తెలుగులో నేనే డబ్బింగ్ చెప్పాను. అందరూ సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను.

పవన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. కార్తీక్ సుబ్బరాజ్ గారు ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. తమిళనాడులో సినిమాకు చాలా గొప్ప రెస్పాన్స్ వస్తోంది. తప్పకుండా ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో కూడా నిలిచిపోతుంది.

కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ.. ఈ సినిమా తమిళనాడులో ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి ఇళయరాజా గారు సంగీతం సమకూర్చడంతో పాటు తమిళంలో అద్భుతమైన పాటలు రాశారు. ఆ పాటలను తెలుగులో రాసే అవకాశం నాకు దక్కడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో ‘ముత్యపు గింజలు’ అనే పాటను రాశాను. ఆ పాట నాకు చాలా ఇష్టం. ఇళయరాజా గారితో కలిసి పనిచేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు గొప్ప విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com