పోలీసింగ్‌లో నాయకత్వం ఎంతో కీలకం: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్

- September 30, 2026 , by Maagulf
పోలీసింగ్‌లో నాయకత్వం ఎంతో కీలకం: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్: పోలీసు శాఖలో సమర్థవంతమైన నాయకత్వం ఎంతో కీలకమని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, ఐపీఎస్ అన్నారు.ఆర్‌బీవీఆర్‌ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 112 మంది ప్రొబేషనరీ డీఎస్పీలతో ఆయన బుధవారం సమావేశమై మాట్లాడారు.
ఈ సందర్భంగా పోలీసింగ్‌లో నాయకత్వ ప్రాధాన్యతపై డీజీపీ వారికి మార్గనిర్దేశం చేశారు. నిజమైన నాయకత్వం హోదా లేదా అధికారంతో నిర్ణయించబడదని, ధైర్యం, దూరదృష్టి, నిజాయితీ, బృంద స్ఫూర్తి, సమర్థవంతమైన కమ్యూనికేషన్, కష్టపడి పనిచేయడం, సృజనాత్మకత, ముఖ్యంగా వినయం వంటి లక్షణాల ద్వారా నాయకత్వం ప్రతిఫలిస్తుందని పేర్కొన్నారు.

ప్రజా సేవలో సుదీర్ఘకాలం పనిచేసే సమయంలో అత్యున్నత నైతిక ప్రమాణాలను పాటించడం ఎంతో అవసరమని సీవీ ఆనంద్ సూచించారు. పోలీసు అధికారులుగా తమ వ్యక్తిగత ప్రతిష్టను కాపాడుకోవడం, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం అత్యంత ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.

వృత్తిపరమైన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడంతో పాటు, ప్రజల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రొబేషనరీ డీఎస్పీలకు డీజీపీ సూచించారు. నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుని భవిష్యత్తులో పోలీసు శాఖకు సమర్థవంతమైన సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com