ఇటలీ దేశాన్ని భారీ భూకంపం కుదిపేసింది
- August 23, 2016
ఇటలీ దేశాన్ని భారీ భూకంపం కుదిపేసింది. బుధవారం తెల్లవారుజామున దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ భూప్రకంపనలు సంభవించాయి. వీటి తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.2గా నమోదైంది. రీటి ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.
భూకంపం ధాటికి పలు భవనాలు కుప్పకూలాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇటలీ రాజధాని రోమ్‌లోనూ 20 సెకన్ల పాటు భూమి కంపించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. .
భూకంపం ధాటికి ఎమాట్రిస్ నగరం ధ్వంసమైనట్లు నగర మేయర్ సర్జియో పిరోజీ తెలిపారు.
నగరం నడిబొడ్డున భారీ భవనాలు కుప్పకూలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు స్థానికులు తెలిపారు. భూకంప తీవ్రతను ముందుగా గుర్తించే యూఎస్‌జీఎస్ పేజర్ సిస్టమ్ ఇటలీలో రెడ్‌అలర్ట్ ప్రకటించింది. 2009లో ఇటలీలోని అకీలా ప్రాంతంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ ఘటనలో 300 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







