వేసవి దెబ్బల్ని నివారించేందుకు చర్యలు
- August 23, 2016
వేసవి కాలంలో తగిలే దెబ్బల్ని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిపెట్టింది మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఎంఓపిహెచ్). మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డెవలప్‌మెంట్ లేబర్ అండ్ సోషల్ ఎఫైర్స్, ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్, సుప్రీం కమిటీ ఫర్ డెలివరీ అండ్ లెగసీ, ఖతార్ రెడ్ క్రిసెంట్ సొసైటీలతో కలిసి సుదీర్ఘంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. వేసవి మండుటెండల్లో సూర్యరశ్మి తగిలే చోట కార్మికులు పనిచేయకుండా ఇప్పటికే తగు జాగ్రత్తలు తీసుకున్నారు. వేసవి ప్రమాదాలు జరగకుండా యాజమాన్యాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ, కార్మికుల భద్రతపై ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడరాదని ఈ సందర్బంగా సమావేశంలో ప్రముఖులు తీర్మానించారు. ఉదయం 11.30 గంటల సమయం లోపు తొలి షిఫ్ట్ పని పూర్తి చేయాలని, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఐదు గంటలకు మించి ఉండరాదని సమావేశంలో అభిప్రాయపడ్డారు. సాయంత్రం షిఫ్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ 3 గంటలకు ముందు ఉండరాదని తేల్చారు. జూన్ 15 నుంచి ఆగస్ట్ 31 వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుంది. నిబంధనల్ని అతిక్రమించిన 60 కంపెనీలపై ఇప్పటికే చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!







