బహ్రెయిన్ అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- October 03, 2026
మనామా: 35వ బహ్రెయిన్ అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. బహ్రెయిన్ అథారిటీ ఫర్ కల్చర్ అండ్ యాంటిక్విటీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాన్ని ప్రముఖ గాయకుడు, సంగీత స్వరకర్త ఖలీద్ అల్షేక్ తన కాన్సర్టుతో ప్రారంభించారు. బహ్రెయిన్ నేషనల్ థియేటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో బహ్రెయిన్ మ్యూజిక్ బ్యాండ్ పాల్గొంది. మాస్ట్రో డాక్టర్ జియాద్ జైమాన్ దగ్గరుండి నడిపించారు.
కచేరీలో ఖలీద్ అల్షేక్ తన సంగీత ప్రస్థానంలోని ముఖ్యమైన ఘట్టాలకు సంబంధించిన పలు పాటలను ప్రదర్శించారు. గల్ఫ్ సంగీత రంగంలో ఆయన చేసిన ప్రముఖ సహకారాలు, భాగస్వామ్యాలను ప్రతిబింబించే పాటలను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ఈ కార్యక్రమంలో కవులు ఫతియా అజ్లాన్, అలీ అల్షర్గావీ రచించిన పద్యాలతో రూపొందిన సంగీతంతోపాటు ప్రముఖ కువైట్ కళాకారుడు అబ్దుల్లా అల్రువైషిద్ ఆలపించిన పాటలు కూడా ప్రదర్శించారు. గల్ఫ్ సంగీత చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ పాటలను మరోసారి ప్రేక్షకులకు పరిచయం చేశారు.
మాస్ట్రో డాక్టర్ జియాద్ జైమాన్ రూపొందించిన సంగీత ఏర్పాట్లు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అసలు పాటల ప్రత్యేకతను కాపాడుతూ, గల్ఫ్ సంగీత సంప్రదాయాల స్ఫూర్తితో కొత్త సంగీత రూపకల్పనలను ఆయన అందించారు.
35వ బహ్రెయిన్ అంతర్జాతీయ సంగీత ఉత్సవం అక్టోబర్, నవంబర్ నెలల్లో కొనసాగనుంది. స్థానిక, అంతర్జాతీయ కళాకారులు, సంగీత బృందాలతో పాటు బహ్రెయిన్ జానపద కళా బృందాలు కూడా ఇందులో ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. బహ్రెయిన్ సంగీత రంగంలోని వైవిధ్యాన్ని, దేశ సాంస్కృతిక విస్తృతిని ఈ ఉత్సవం ప్రతిబింబించనుంది.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







