థాయ్‌లాండ్ వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది
- August 23, 2016
థాయ్‌లాండ్: పర్యాటకానికి ప్రధాన కేంద్రంగా ఉన్న థాయ్‌లాండ్ వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. పట్టాని ప్రావిన్స్‌లోని సదరన్ హోటల్ పార్కింగ్ ప్రాంతంలోనూ, హోటల్ ప్రవేశ ద్వారం వద్ద ఉంచిన ట్రక్కులోనూ మంగళవారం రాత్రి బాంబులు పేలాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. రెండు వారాల క్రితం జరిగిన బాంబు పేలుళ్లలో నలుగురు చనిపోగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. థాయ్‌లాండ్‌కు 10% శాతం వరకు ఆదాయం పర్యాటక రంగం నుంచే వస్తోంది. తరుచూ బాంబు పేలుళ్ల ఘటనలు జరుగుతుండటంతో ఆ ప్రభావం పర్యాటకంపై పడుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







