‘ఐస్’.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు!
- October 03, 2026
‘ఉయారే’ చిత్ర దర్శకుడు మను అశోకన్ తొలిసారిగా దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ ‘ఐస్’ Sony LIV లో అక్టోబర్ 9 నుంచి ప్రసారం కానుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ నిర్మాతలు శుక్రవారం అధికారిక ట్రైలర్‌ను విడుదల చేశారు. “వాచ్, ప్రొటెక్ట్, డిఫెండ్” అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సిరీస్‌లో కని కుసృతితో పాటు శృతి రామచంద్రన్, నిఖిలా విమల్, సానియా అయ్యప్పన్ మరియు దేవ్ మోహన్ కీలక పాత్రలు పోషించారు.
ఆకట్టుకునే ఇన్వెస్టిగేటివ్ కథాంశం
‘ఉయారే’, ‘కానెక్కానె’ సినిమాల తర్వాత రచయితలు బాబీ-సంజయ్ కలయికలో మను అశోకన్ తెరకెక్కిస్తున్న సిరీస్ ఇది. అంజనా నాయర్ అందించిన కథ ఆధారంగా ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌ను రూపొందించారు. మహిళలపై జరిగే నేరాలు, వేధింపులను దర్యాప్తు చేసే పోలీస్ ఆఫీసర్ టీనా సెబాస్టియన్ (కని కుసృతి) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. స్టాకర్ల మనస్తత్వాన్ని అంచనా వేస్తూ దర్యాప్తును ముందుకు తీసుకెళ్లే క్రమంలో మానసిక ఆరోగ్య నిపుణులు పోలీసులకు ఎలాంటి సహాయం అందించారనే అంశాలను ఇందులో ఆసక్తికరంగా చూపించనున్నారు.
విభిన్న భాషల్లో అందుబాటులోకి..
డ్రీమ్ కట్చర్ ప్రొడక్షన్స్ పతాకంపై టి.ఆర్. షంసుద్దీన్ ఈ సిరీస్‌ను నిర్మించగా, గౌతమ్ శంకర్ సినిమాటోగ్రఫీని, రంజిన్ రాజ్ సంగీతాన్ని అందించారు. వ్యామోహం, భయం, నియంత్రణల మధ్య ఉండే సస్కన్స్ అంశాలను విశ్లేషించే ఈ సిరీస్ మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ మరియు హిందీ భాషలలో కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







