ఎన్ఆర్ఐలకు డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యకు ప్రత్యేక అవకాశాలు
- October 03, 2026
సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలోని ఎన్ఆర్ఐల కోసం డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆన్లైన్ జూమ్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా.ఎల్.వి.కె.రెడ్డి గారు మరియు పలు విభాగాల డైరెక్టర్లు ప్రొ.డి.రబింద్రనాథ్ సోలమన్, ప్రొ.పల్లవి కాబడే, ప్రొ.కె శ్రీదేవి, డా.వెంకటేశ్వర్లు పాల్గొని, ఎన్ఆర్ఐలకు అందుబాటులో ఉన్న ఉన్నత విద్యా కోర్సులు, అర్హతలు, ఫీజులు, అడ్మిషన్లు, పరీక్షల విధానం తదితర అంశాలను స్పష్టంగా వివరించారు.
ఎన్ఆర్ఐలు తమ నివాస దేశం నుంచే ఉన్నత విద్యను కొనసాగించే విధంగా డిగ్రీ, పీజీ, ఎంబీఏ తదితర ఉన్నత విద్యా అవకాశాలను వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఆన్లైన్ విధానంలో ఫీ మరియు పరీక్షల నిర్వహణ, అందుబాటులో ఉన్న సౌకర్యాలను ఉపయోగించుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఎన్ ఆర్ ఐ అడ్వైసరీ కమిటీ చైర్మన్ అంబాసిడర్ డా.బీ.ఎం.వినోద్ కుమార్,
ఎన్ ఆర్ ఐ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మందా భీమారెడ్డి, సామాజిక కార్యకర్త మహేశ్ కే.పీ. గారు, సౌదీ అరేబియాలోని సామాజిక సేవా కార్యకర్త శ్రీనివాస్ మచ్చ పాల్గొన్నారు. ఎన్ఆర్ఐలకు కోర్సులు, అడ్మిషన్లు మరియు ఇతర వివరాలపై సహాయం అవసరమైతే మహేశ్ కే.పీ. గారు +919032076267 మరియు శ్రీనివాస్ మచ్చ ని +966 541507276 సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సౌదీ అరేబియాలోని వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులు మరియు ఎన్ఆర్ఐలకు విశ్వవిద్యాలయ ప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్ఆర్ఐలు డా. బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కల్పించే ఈ ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ విద్య, వృత్తిపరమైన అభివృద్ధికి ముందుకు రావాలని నిర్వాహకులు కోరారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..!!
- మస్కట్లో అల్ ఖువైర్ స్ట్రీట్ ఎగ్జిట్ రాత్రివేళ మూసివేత..!!
- మలేషియా వెళ్లే భారతీయులకు అలర్ట్.. 2027 నుంచి కొత్త రూల్స్
- ఖతార్లో పిల్లలను కారులో వదిలేస్తే QR10,000 జరిమానా..!!
- పాకిస్థాన్లో ఘోర విషాదం..రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి!
- సౌదీ సరిహద్దుల్లో ‘అబ్షర్ ట్రావెల్’ సేవలకు ఎలక్ట్రిక్ బైక్లు..!!
- సౌదీ అరేబియాలో 2027 నుంచి కొత్త టాక్స్ విధానం..!!
- కువైట్లో ఆహార భద్రత తనిఖీలు..!!
- యూఏఈలో ఫైర్ వర్క్స్, డ్రోన్ షోలు, సైనిక పరేడ్లతో సందడి..!!
- బంగాళాఖాతంలో భీకర తుపాను.. ఏపీ తీర ప్రాంతాలకు హై అలర్ట్..







