సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కేరళ నర్సులు సహా ఐదుగురు మృతి
- October 04, 2026
రియాద్: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కేరళ నర్సులు సహా ఐదుగురు మృతి చెందారు. మక్కా ప్రావిన్స్‌లోని తాయిఫ్–రనియా రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
మృతుల్లో కేరళకు చెందిన జైసీమోల్ మాథ్యూ (46), జోబినా జాన్ ఉన్నారు. జైసీమోల్ మాథ్యూ కొట్టాయం జిల్లా అయ్యర్కున్నం ప్రాంతానికి చెందినవారు కాగా, జోబినా జాన్ కొట్టాయం జిల్లా కురుముల్లూర్లోని అనాచెరింజక్కున్నేల్ ప్రాంతానికి చెందినవారు.
ప్రమాదంలో మృతి చెందిన మరో ఇద్దరు భారతీయులను తమిళనాడుకు చెందిన విజయలక్ష్మి జగదీష్ (37), హెప్సిబా దేవమణి (33)గా గుర్తించారు. వీరిద్దరూ కూడా నర్సులుగా పనిచేస్తున్నారు. ఐదో మృతుడు సౌదీ జాతీయుడు కాగా, ఆయనే కారును నడుపుతున్నట్లు సమాచారం.
అదుపు తప్పి బోల్తా పడిన కారు
రనియా పట్టణానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడటంతో అందులో ఉన్న ఐదుగురూ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
మాత్రుభూమి కథనం ప్రకారం, మృతులంతా తాయిఫ్ గవర్నరేట్ పరిధిలోని అల్-ఘాఫా, అల్-అవైలా క్లినిక్‌లలో పనిచేస్తున్నారు. సెలవు రోజున షాపింగ్, ఇతర వ్యక్తిగత పనుల కోసం రనియాకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను ప్రస్తుతం రన్యా జనరల్ ఆసుపత్రిలో భద్రపరిచారు. అవసరమైన అధికారిక ప్రక్రియలు పూర్తయిన అనంతరం మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం.
ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సౌదీ అధికారులు ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కేరళ నర్సులు సహా ఐదుగురు మృతి
- కాక్‌పిట్ పై దాడి.. ‘చివరి పోరాటం’తో వందల ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ పైలట్
- సినీ లోకానికి తీరని విషాదం..సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు
- ఎన్ఆర్ఐలకు డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యకు ప్రత్యేక అవకాశాలు
- తెలంగాణలో బతుకమ్మ సందడి..
- మెన్స్ హాకీ ఫైనల్లో భారత్ ఘన విజయం
- ఫ్లై దుబాయ్ పైలట్ స్మిత్ మచ్ఛర్‌ను పరామర్శించిన షేక్ హమ్దాన్దు
- బహ్రెయిన్ అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- యూఏఈలో ట్రక్కుల సేవలు, ఫుడ్ డెలివరీ ఛార్జీలు పెరుగుతాయా?
- మక్కా గ్రాండ్ మసీదులో సూసైడ్ బాంబర్ ప్రచారం ఫేక్..!!







