హవల్లీ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం..!!

- October 04, 2026 , by Maagulf
హవల్లీ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం..!!

కువైట్ : కువైట్‌లోని హవల్లీ ప్రాంతంలో గ్యాస్ లీకేజీ కారణంగా అపార్ట్‌మెంట్‌లో పేలుడు సంభవించి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక వ్యక్తి గాయపడ్డారు. సమాచారం అందుకున్న హవల్లీ ఫైర్ స్టేషన్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారని పేర్కొన్నారు.

అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని నియంత్రించిన అనంతరం గాయపడిన వ్యక్తిని తదుపరి వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపింది. శనివారం ఉదయం జరిగిన గ్యాస్ లీకేజీకి ఖచ్చితమైన కారణం ఏమిటన్న దానిపై అధికారులు ఇప్పటివరకు ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.  ఘటనపై తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com