బిగ్ టికెట్ అబుదాబి.. అజ్మాన్ ఫిలిప్పీన్స్ ప్రవాసికి Dh20 మిలియన్ జాక్‌పాట్..!!
- October 04, 2026
అబుదాబి: బిగ్ టికెట్ అబుదాబి అక్టోబర్ లైవ్ డ్రాలో అజ్మాన్‌లో నివసిస్తున్న ఫిలిప్పీన్స్ ప్రవాసి బెర్నాడెట్ అజుసెనా ఏకంగా Dh20 మిలియన్ జాక్‌పాట్ గెలుచుకున్నారు. విజేత టికెట్ నంబర్ 013075. జాక్‌పాట్ విజేతగా ఆమె పేరు ప్రకటించిన అనంతరం బిగ్ టికెట్ హోస్టులు రిచర్డ్, బౌష్రా ఆమెకు ఫోన్ చేసి విజయం గురించి తెలియజేయడానికి ప్రయత్నించారు. అయితే లైవ్ డ్రా సమయంలో ఆమె కాల్‌ను అందుకోలేదు. గత నెల సెప్టెంబర్ డ్రాలో పాకిస్థాన్‌కు చెందిన షౌకత్ అఫ్తాబ్ Dh15 మిలియన్ జాక్‌పాట్ గెలుచుకున్నారు. అక్టోబర్ డ్రాలో విజేత టికెట్‌ను ఎంపిక చేసేందుకు ఆయన కూడా బిగ్ టికెట్ స్టూడియోకు హాజరయ్యారు.
ఐదుగురు భారతీయులకు కన్సొలేషన్ బహుమతులు
అదే డ్రాలో మరో ఐదుగురు భారతీయ ప్రవాసులు కలిపి Dh1.95 మిలియన్ విలువైన కన్సొలేషన్ బహుమతులు గెలుచుకున్నారు.
- అబుదాబిలో నివసిస్తున్న సునీల్ కుమార్ — టికెట్ నంబర్ 098059తో Dh1 మిలియన్
- అజ్మాన్ నివాసి కుల్వంత్ సింగ్ — టికెట్ నంబర్ 020601తో Dh500,000
- మస్కట్‌లో నివసిస్తున్న అజిత్ కుమార్ వన్నరత్ — Dh250,000
- అజ్మాన్‌కు చెందిన ముహమ్మద్ ఇజాస్ — టికెట్ నంబర్ 129625తో Dh100,000
- దుబాయ్ నివాసి సెట్వాన్ కుమార్ చౌహాన్ — టికెట్ నంబర్ 320975తో Dh100,000
ఇదే డ్రాలో మరో భారతీయ ప్రవాసి వసీమ్ ఖాన్ డ్రీమ్ కార్‌గా ఉన్న నిస్సాన్ ప్యాట్రోల్ ను గెలుచుకున్నారు. ఆయన దుబాయ్‌లో నివసిస్తున్నారు.
నవంబర్, డిసెంబర్‌లో మరిన్ని డ్రాలు
నవంబర్‌లో జరిగే బిగ్ స్పిన్ లైవ్ డ్రాలో పాల్గొనే ముగ్గురు పోటీదారుల పేర్లను కూడా శనివారం ప్రకటించారు. అక్టోబర్ నెలలో నిర్వహించే వారపు ఈ-డ్రాల్లో నలుగురు విజేతలకు తలా 200 గ్రాముల 24 క్యారెట్ బంగారు బార్ అందించనున్నారు. ఈ డ్రాలను రాత్రి 7:30 గంటలకు బిగ్ టికెట్ యూట్యూబ్ ఛానల్, వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
అక్టోబర్‌లో కనీసం ఒక బిగ్ టికెట్ కొనుగోలు చేసిన వారికి నవంబర్ 3న జరిగే లైవ్ డ్రాలో బిగ్ స్పిన్ కోసం ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. ఎంపికైన ముగ్గురు డిసెంబర్ 3న జరిగే బిగ్ స్పిన్‌లో పాల్గొంటారు. ఇందులో ఒక్కొక్కరు గరిష్ఠంగా Dh1 మిలియన్ వరకు గెలుచుకునే అవకాశం ఉంటుంది. అదే సమయంలో మరో రెండు డ్రీమ్ కార్ డ్రాలు కూడా జరగనున్నాయి. నవంబర్ 3న రేంజ్ రోవర్ వెలార్, డిసెంబర్ 3న నిస్సాన్ ప్యాట్రోల్ బహుమతులుగా అందుబాటులో ఉంటాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!
- యూఏఈ లాటరీ.. ఓ విజేతకు Dh5 మిలియన్ భారీ బహుమతి..!!
- హవల్లీ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. అజ్మాన్ ఫిలిప్పీన్స్ ప్రవాసికి Dh20 మిలియన్ జాక్‌పాట్..!!
- బహ్రెయిన్ విమానాశ్రయం వెనుక మాంగ్రూవ్ బెల్ట్..!!
- కువైట్ విమానాశ్రయంలో ట్రాన్సిట్ కార్యకలాపాలు నిలిపివేత యధాతథం..!!
- సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కేరళ నర్సులు సహా ఐదుగురు మృతి
- కాక్‌పిట్ పై దాడి.. ‘చివరి పోరాటం’తో వందల ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ పైలట్







