ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!

- October 04, 2026 , by Maagulf
ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!

మస్కట్: ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాలు నిర్వహించే వ్యక్తులు, సంస్థలు తప్పనిసరిగా లైసెన్స్ పొందాలని రాయల్ డిక్రీ 69/2023 ద్వారా జారీ చేసిన టూరిజం చట్టం స్పష్టం చేస్తోంది. లైసెన్సింగ్ పరిధిలో ప్రధానంగా టూరిస్ట్, హోటల్ సంస్థల నిర్వహణ, ట్రావెల్ అండ్ టూరిజం కార్యాలయాలు, విదేశీ టూరిజం కంపెనీల శాఖలు, కార్యాలయాలు, టూరిస్ట్ గైడ్ సేవలు, అడ్వెంచర్ టూరిజం, టూరిస్ట్, హోటల్ సంస్థల్లో హై ఆర్ట్ పెర్ఫార్మెన్స్ గ్రూపులు, బిజినెస్ టూరిజం వంటి కార్యకలాపాలు ఉంటాయి.

దరఖాస్తు, పునరుద్ధరణ నిబంధనలు
లైసెన్స్ కోసం నిర్ణీత దరఖాస్తు ఫారం, అవసరమైన పత్రాలు, ఫీజును సమర్పించాలి. పూర్తి దరఖాస్తు సమర్పించిన 60 రోజుల్లోపు నిర్ణయం తీసుకోకపోతే, ఆ దరఖాస్తు ఆమోదమైనట్లుగా పరిగణిస్తారు. లైసెన్స్ గడువు ముగియడానికి కనీసం 60 రోజుల ముందు పునరుద్ధరణ దరఖాస్తు చేయాలి. ఆలస్యంగా పునరుద్ధరిస్తే ప్రతి నెల లైసెన్స్ ఫీజులో 10 శాతం జరిమానా విధిస్తారు. గడువు ముగిసిన 60 రోజుల్లోపు పునరుద్ధరించకపోతే లైసెన్స్ రద్దవుతుంది. లైసెన్స్‌లో మార్పులు చేయడం, ఇతరులకు బదిలీ చేయడం లేదా లైసెన్స్‌కు సంబంధించిన హక్కులను అప్పగించడం వంటి చర్యలకు మంత్రిత్వ శాఖ నుంచి ముందస్తు లిఖితపూర్వక అనుమతి తప్పనిసరి.

టూరిజం, హోటల్ సంస్థలకు అదనపు షరతులు
నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ సస్పెన్షన్

నిర్దేశించిన బాధ్యతలను నెరవేర్చకపోయినా లేదా ఎగ్జిక్యూటివ్ రెగ్యులేషన్ నిబంధనలను ఉల్లంఘించినా లైసెన్స్‌ను సస్పెండ్ చేయవచ్చు. లైసెన్స్ మంజూరుకు అవసరమైన షరతుల్లో ఏదైనా కోల్పోతే లేదా మంత్రిత్వ శాఖ అనుమతి లేకుండా లైసెన్స్‌ను బదిలీ చేస్తే లైసెన్స్ రద్దు చేయవచ్చు. లైసెన్స్ లేకుండా పర్యాటక కార్యకలాపాలు నిర్వహించడం, టూరిస్ట్ లేదా హోటల్ సంస్థను నిర్వహించడం, విదేశీ టూరిజం కంపెనీ శాఖ లేదా కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం వంటి చర్యలకు 10 రోజుల నుంచి ఆరు నెలల వరకు జైలు శిక్ష, OMR 6,000 నుంచి OMR 50,000 వరకు జరిమానా, లేదా ఈ రెండింటిలో ఏదో ఒకటి విధించవచ్చు.  

మంత్రిత్వ శాఖ అనుమతి లేకుండా లైసెన్స్‌ను బదిలీ చేయడం లేదా దాని హక్కులను ఇతరులకు అప్పగించడం వంటి చర్యలకు OMR 3,000 నుంచి OMR 6,000 వరకు జరిమానా విధించవచ్చు. ఒమన్‌లో పర్యాటక రంగంలో కార్యకలాపాలు ప్రారంభించాలనుకునే వ్యక్తులు, సంస్థలు లైసెన్సింగ్ నిబంధనలు, అవసరమైన పత్రాలు, పునరుద్ధరణ గడువులు, అనుమతుల ప్రక్రియలను ముందుగానే తెలుసుకుని అనుసరించడం కీలకమని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.

పర్యాటక కార్యకలాపాలు నిర్వహించడం, టూరిస్ట్ లేదా హోటల్ సంస్థలను నిర్వహించడం, విదేశీ టూరిజం కంపెనీల శాఖలు లేదా కార్యాలయాలను ఏర్పాటు చేయడం వంటి కార్యకలాపాలకు సంబంధిత మంత్రిత్వ శాఖ నుంచి ముందస్తు లైసెన్స్ తప్పనిసరి అని మొహమ్మద్ ఇబ్రహీం లా ఫర్మ్ చైర్మన్ డాక్టర్ మొహమ్మద్ ఇబ్రహీం అల్ జద్జాలి స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com