క్రాస్ బార్డర్ నేరాలపై GCC దేశాల మధ్య మరింత సహకారం..!!

- October 06, 2026 , by Maagulf
క్రాస్ బార్డర్ నేరాలపై GCC దేశాల మధ్య మరింత సహకారం..!!

మనామా: సరిహద్దులు దాటి జరిగే నేరాలను అరికట్టేందుకు గల్ఫ్‌ సహకార మండలి (GCC) దేశాల మధ్య భద్రతా, న్యాయ సహకారాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. సౌదీ అరేబియాలోని రియాద్‌లో నిర్వహించిన గల్ఫ్‌ వర్క్‌షాప్‌లో బహ్రెయిన్‌ ప్రతినిధి బృందం పాల్గొంది. ఈ బృందంలో పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌తో పాటు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సుప్రీం జ్యుడీషియల్‌ కౌన్సిల్‌ ప్రతినిధులు ఉన్నారు.
GCC దేశాల్లోని భద్రతా సంస్థలు, పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ కార్యాలయాలు, న్యాయస్థానాల మధ్య సమన్వయాన్ని మరింత పెంచడంపై వర్క్‌షాప్‌లో ప్రధానంగా చర్చించారు. బహ్రెయిన్‌ క్రిమినల్‌ జడ్జ్‌మెంట్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ప్రాసిక్యూషన్‌ చీఫ్‌ ఈ సందర్భంగా ఒక పత్రాన్ని సమర్పించారు. GCC దేశాల మధ్య నిందితుల అప్పగింత, నేరాలకు సంబంధించిన నిధుల గుర్తింపు, వాటి రికవరీ వంటి అంశాల్లో పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ పాత్రను ఆయన వివరించారు.

ఆస్తుల రికవరీలో ఎదురవుతున్న విధానపరమైన సవాళ్లు, ఆయా దేశాలు చేపడుతున్న చర్యలను పత్రంలో ప్రస్తావించారు. అలాగే GCC స్థాయిలో యూనిఫైడ్ అరెస్ట్‌ వారెంట్‌, నేరాల ద్వారా వచ్చిన నిధులను వేగంగా ఫ్రీజ్‌ చేసి స్వాధీనం చేసుకునే వ్యవస్థ, పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ కార్యాలయాల కోసం విధాన మార్గదర్శకం ఏర్పాటు వంటి ప్రతిపాదనలు చేశారు.సరిహద్దులు దాటి జరిగే నేరాలపై ఉమ్మడి చర్యలను బలోపేతం చేయడంతో పాటు న్యాయ, భద్రతా సహకారాన్ని పెంపొందించేందుకు బహ్రెయిన్‌ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com