విటమిన్లతో సంపూర్ణ ఆరోగ్యం
- July 29, 2015
శరీరానికి విటమిన్లుతో కూడిన ఆహారం చాలా అవసరం. రోగనిరోధక శక్తి పెరగడానికి, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండడానికి విటమిన్లు చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా 'విటమిన్ ఇ' ఎర్రరక్తకణాలు వృద్ధి చెందడానికి తోడ్పడుతుంది. ఈ విటమిన్ పుట్టగొడుగులుచ మొక్కజొన్నలు, డ్రైఫ్రూట్స్, చేపలు వంటి వాటిలో ఎక్కువగా లభిస్తుంది. పుట్టగొడుగుల్లో విటమిన్ బి 5 ఎక్కువగా ఉంటుంది. వీటిని తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల జీవక్రియ రేటు వృద్ది చెందడమే కాకుండా, రక్తహీనతతో బాధపడేవారికి ఎంత ఎక్కువగా తింటే అంత మంచిది. ప్రతిరోజూ ఉడికించిన మొక్కజొన్నలు తీసుకోవడం వల్ల విటమిన్స్ అంది శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఇక డ్రైఫ్రూట్స్, నట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన విటమిన్లు అంది, శరీరంలో జీవ, రసాయనిక ప్రక్రియలు బాగా జరుగుతాయి. ఇక మాంసాహారం తీసుకొనేవాళ్లు గుడ్లు, చేపలూ ఎక్కువగా తీసుకోవాలి. శాఖాహారులైతే పాలూ, పెరుగూ వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల విటమిన్ బి5 శరీరానికి పుష్కలంగా అంది, శరీరం ధృఢంగా ఉండి ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది.
తాజా వార్తలు
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!







