ఫిష్ పటూరీ
- July 29, 2015
ఫిష్ పటూరీ
కావలసిన పదార్ధాలు
చేప ముక్కలు - పావుకేజీ
ఆవాలు - ఒక స్పూను(నానబెట్టుకోవాలి)
పచ్చిమిర్చి - నాలుగు
పసుపు - చెంచా
కొబ్బరి ముక్కలు - ఒక కప్పు
చక్కెర - అర స్పూను
ఉప్పు - తగినంత
ఆవనూనె - మూడు చెంచాలు
అరటి ఆకులు - రెండు,మూడు చిన్నవి(పొట్లం కట్టడానికి వీలుగా)
తయారీ విధానం
ముందుగా చేప ముక్కల్ని శుభ్రం చేసి పెట్టుకోవాలి.తరువాత ఆవాలు, కొబ్బరీ, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో చక్కెరా, పసుపూ, నిమ్మరసం కలిపాలి. ఈ మిశ్రమాన్ని చేపముక్కలకి పట్టించి ఉంచాలి. వాటిపై ఒక చెంచా ఆవనూనె వేసి కలిపి ఒక అరగంట సేపు అలానే ఉంచాలి. ఇప్పుడు ఒక అరటి ఆకును తీసుకుని దానిలో చేప ముక్కను ఉంచి దాని అంచుల్ని మూసి పొట్లంలా దారంతో చుట్టేయాలి. ఇలాగే మిగతా ముక్కలను కూడా చేసి ఆవిరి మీద ఈ ముక్కలను పది నిముషాల పాటు ఉడికించి తీసుకోవాలి. ఇప్పుడు ఆవిరి నుంచి తీసుకుని ఆరటి ఆకులు తొలగించి వేడి వేడి అన్నంతో కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







