యూఏఈ-భారత్ విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- October 06, 2026
దుబాయ్: భారత్-మిడిల్ ఈస్ట్ దేశాల మధ్య విమాన ప్రయాణికులకు మరింత మెరుగైన కనెక్టివిటీ అందించేందుకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. 2026 శీతాకాల షెడ్యూల్లో భాగంగా భారత్ నుంచి మధ్యప్రాచ్యానికి విమాన సర్వీసులను పెంచుతోంది. ఈ విస్తరణలో భాగంగా ఈ ప్రాంతానికి రోజుకు గరిష్ఠంగా 135 విమాన సర్వీసులు నడపనున్నట్లు ఎయిర్‌లైన్ ప్రకటించింది.
బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కొచ్చి, కోഴിക്കోడ్, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలను హబ్‌లు, ఫోకస్ సిటీలుగా చేసుకుని మధ్యప్రాచ్య రూట్లలో విమానాల ఫ్రీక్వెన్సీని పెంచనుంది.
యూఏఈతో పాటు పలు గల్ఫ్ నగరాలకు అదనపు సర్వీసులు
అత్యంత రద్దీగా ఉండే భారత్-మధ్యప్రాచ్య మార్గాల్లో ఈ అదనపు విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. దుబాయ్, అబుదాబి, షార్జా, దమ్మామ్, జెడ్డా, రియాద్, దోహా, మస్కట్, కువైట్ సిటీ, అల్ ఐన్ వంటి నగరాలకు కనెక్టివిటీ పెరగనుంది.
మొత్తంగా భారత్‌లోని 23 నగరాలను, బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈలోని 12 గేట్‌వే నగరాలతో కలుపుతూ 88 నాన్‌స్టాప్ సిటీ-పెయిర్ రూట్లలో విమానాలను నడపనుంది.
దీంతో భారత్-మధ్యప్రాచ్య విమాన మార్గంలో అతిపెద్ద ఆపరేటర్లలో ఒకటిగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోనుంది.
మార్చి 27, 2027 వరకు శీతాకాల షెడ్యూల్
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అంతర్జాతీయ నెట్‌వర్క్‌లో మధ్యప్రాచ్య ప్రాంతం కీలక భాగంగా ఉంది. ఈ శీతాకాలంలో ప్రపంచవ్యాప్తంగా 99 గమ్యస్థానాలకు రోజుకు 150 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.
2026 శీతాకాల షెడ్యూల్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఇప్పటివరకు నిర్వహిస్తున్న అతిపెద్ద వింటర్ షెడ్యూల్‌గా నిలవనుంది. ఈ షెడ్యూల్ 2027 మార్చి 27 వరకు కొనసాగుతుంది.
భారతీయ ప్రవాసులకు మరింత సౌకర్యం
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రవాస భారతీయ సమూహాల్లో ఒకటి మధ్యప్రాచ్యంలో ఉంది. యూఏఈలోనే 40 లక్షలకు పైగా భారతీయులు వివిధ రంగాల్లో నివసిస్తూ, పనిచేస్తున్నారు.
ఉద్యోగాలు, కుటుంబ సభ్యులను కలుసుకోవడం, పర్యటన వంటి అవసరాల కోసం ప్రయాణించే వారికి మరిన్ని విమాన ఎంపికలు, మెరుగైన కనెక్టివిటీ అందించడమే ఈ విస్తరణ లక్ష్యమని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తెలిపింది.
అదనంగా విమానాల ఆధునీకరణపై కూడా ఎయిర్‌లైన్ దృష్టి సారించింది. రీట్రోఫిట్ చేసిన విమానాలను ఈ శీతాకాలంలో పలు మధ్యప్రాచ్య మార్గాల్లో ప్రవేశపెట్టనుంది. బెంగళూరు, ఢిల్లీ హబ్‌లలో సామర్థ్యాన్ని పెంచడంతో పాటు కొత్త దేశీయ మార్గాలను కూడా ప్రారంభించనుంది.
తాజా వార్తలు
- భారత మహిళల జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన
- జాతీయ రహదారి పనులపై ఎంపీ బాలశౌరి సమీక్ష
- ‘దాదా’- మైసూరులో షూటింగ్ పునః ప్రారంభించిన బాలకృష్ణ
- విజయవాడ ఉత్సవ్–2026కు తమిళనాడు ముఖ్యమంత్రికి ఆహ్వానం
- యూఏఈ-భారత్ విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- తిరుమలలో ఈ నెల 11 నుంచి 20 వరకు వీఐపీ దర్శనాలు రద్దు
- ఫోన్ స్కామ్‌తో Dh11.8 మిలియన్ మోసం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన దుబాయ్ పోలీసులు
- ఒమన్ సమీపంలో ట్యాంకర్‌పై దాడి..12 మందికి గాయాలు
- రాహుల్ గాంధీ, ప్రియాంకను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2026కు యూఏఈలో శ్రీకారం







