విజయవాడ ఉత్సవ్–2026కు తమిళనాడు ముఖ్యమంత్రికి ఆహ్వానం

- October 06, 2026 , by Maagulf
విజయవాడ ఉత్సవ్–2026కు తమిళనాడు ముఖ్యమంత్రికి ఆహ్వానం

చెన్నై: అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు విజయవాడలో నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్–2026కు ముఖ్య అతిథిగా హాజరు కావాలని తమిళనాడు ముఖ్యమంత్రి టి.ఎస్. జోసెఫ్ విజయ్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరఫున ఏపీకి చెందిన పార్లమెంట్ సభ్యులు ఆహ్వానించారు.

ఈ మేరకు ఏపీకి చెందిన ఎంపీలు చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. విజయవాడ ఉత్సవ్–2026లో ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు తమిళనాడు ముఖ్యమంత్రిని కోరారు.

ఈ సందర్భంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, అమలాపురం ఎంపీ జి.ఎం.సి. హరీష్ బాలయోగి, అలాగే విజయవాడ ఉత్సవ్ కమిటీ చైర్మన్ కె. మురళి తమిళనాడు ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.

విజయవాడ నగర సాంస్కృతిక, సామాజిక వైభవాన్ని ప్రతిబింబించేలా నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్–2026లో తమిళనాడు ముఖ్యమంత్రి పాల్గొనడం ద్వారా రెండు రాష్ట్రాల మధ్య సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని వారు ఆకాంక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com