భారత మహిళల జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన
- October 07, 2026
భారత మహిళల క్రికెట్ జట్టులో కొత్త శకం ప్రారంభమైంది. సీనియర్ ఓపెనర్ స్మృతి మంధానను భారత మహిళల క్రికెట్ జట్టు నూతన కెప్టెన్‌గా బీసీసీఐ మంగళవారం నియమించింది. ఇప్పటివరకు సుదీర్ఘకాలం కెప్టెన్‌గా వ్యవహరించిన హర్మన్‌ప్రీత్ కౌర్ స్థానంలో 29 ఏళ్ల మంధాన మొత్తం మూడు ఫార్మాట్లలో జట్టు బాధ్యతలను స్వీకరించనుంది. మంధాన జింబాబ్వేతో టీ20 సిరీస్ నుంచి కెప్టెన్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది.
హర్మన్‌ప్రీత్ వీడ్కోలు
భారత జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు మంగళవారం ఉదయం హర్మన్‌ప్రీత్ కౌర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అంతకుముందు సోమవారం గౌహతిలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, హెడ్ కోచ్ అమోల్ ముజుందార్, స్మృతి మంధాన మరియు హర్మన్‌ప్రీత్‌ల మధ్య జరిగిన కీలక రివ్యూ సమావేశం అనంతరం ఈ మార్పు చోటుచేసుకుంది. 2013లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన స్మృతి మంధానకు ఇప్పటి వరకు 18 టీ20లు, 4 వన్డేల్లో భారత జట్టును నడిపించిన అనుభవం ఉంది.
డబ్ల్యూపీఎల్‌లో డబుల్ ఛాంపియన్ కెప్టెన్
ఫ్రాంచైజ్ క్రికెట్లో స్మృతి మంధానకు కెప్టెన్‌గా అద్భుతమైన రికార్డు ఉంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టును 2024, 2026 సీజన్లలో రెండుసార్లు ఛాంపియన్‌గా నిలబెట్టి తన నాయకత్వ పటిమను చాటుకుంది. ఆ అనుభవమే ఇప్పుడు ఆమెను జాతీయ జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్‌ను చేసింది.
నాయకత్వ బాధ్యత పై మంధాన స్పందన
భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశం రావడంపై స్మృతి మంధాన హర్షం వ్యక్తం చేససింది. “భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎల్లప్పుడూ నాకు ఎంతో గర్వకారణం. ఇప్పుడు జట్టును ముందుండి నడిపించే బాధ్యత లభించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. నాపై నమ్మకం ఉంచిన బీసీసీఐ, సెలక్టర్లు, సహచర ఆటగాళ్లకు ధన్యవాదాలు” అని ఆమె తెలిపింది.
తాజా వార్తలు
- భారత మహిళల జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన
- జాతీయ రహదారి పనులపై ఎంపీ బాలశౌరి సమీక్ష
- ‘దాదా’- మైసూరులో షూటింగ్ పునః ప్రారంభించిన బాలకృష్ణ
- విజయవాడ ఉత్సవ్–2026కు తమిళనాడు ముఖ్యమంత్రికి ఆహ్వానం
- యూఏఈ-భారత్ విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- తిరుమలలో ఈ నెల 11 నుంచి 20 వరకు వీఐపీ దర్శనాలు రద్దు
- ఫోన్ స్కామ్‌తో Dh11.8 మిలియన్ మోసం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన దుబాయ్ పోలీసులు
- ఒమన్ సమీపంలో ట్యాంకర్‌పై దాడి..12 మందికి గాయాలు
- రాహుల్ గాంధీ, ప్రియాంకను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2026కు యూఏఈలో శ్రీకారం







