సహెల్ యాప్‌లో పీఏసీఐకి చెందిన 34 సేవలు..!!

- October 07, 2026 , by Maagulf
సహెల్ యాప్‌లో పీఏసీఐకి చెందిన 34 సేవలు..!!

కువైట్ : కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (PACI)కు చెందిన 34 సేవలు ఇకపై ప్రభుత్వ ఏకీకృత ఎలక్ట్రానిక్ సేవల యాప్ ‘సహెల్’ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. దీంతో పౌరులు, నివాసితులు పీఏసీఐ కార్యాలయాలను సందర్శించకుండానే తమ లావాదేవీలను ఆన్‌లైన్‌లో పూర్తి చేసుకోవచ్చని సంస్థ తాత్కాలిక డైరెక్టర్ జనరల్ ఈసా అల్ మహ్మూద్ తెలిపారు. జాతీయ సిబ్బంది సహకారంతో ఎలక్ట్రానిక్ సేవల వ్యవస్థను నిరంతరం అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సేవల సామర్థ్యాన్ని పెంచడం, ప్రక్రియలను సులభతరం చేయడం, వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడం తమ లక్ష్యమని పేర్కొన్నారు.

సహెల్ యాప్‌లో అందుబాటులో ఉన్న సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ఎలక్ట్రానిక్ విధానంలో లావాదేవీలు పూర్తి చేయడం సౌకర్యవంతంగా, వేగవంతంగా, కచ్చితంగా, భద్రంగా ఉంటుందని తెలిపారు. సహెల్ యాప్ ద్వారా అందుబాటులో ఉన్న సేవల్లో ధ్రువపత్రాలు, సంస్థలు–భవనాలకు సంబంధించిన సేవలు, సివిల్ ఐడీ కార్డులు, వ్యక్తులు, నివాసితుల డేటా వంటి అంశాలు ఉన్నాయి.

అయితే ఎలక్ట్రానిక్ సేవలను వినియోగించుకోలేని వృద్ధులు, ఇతరులకు పీఏసీఐ సహాయం కొనసాగుతుందని అల్ మహ్మూద్ స్పష్టం చేశారు. సహెల్‌లో సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ, అవసరమైన వారు పీఏసీఐ విభాగాలను నేరుగా సందర్శించి తమ లావాదేవీలను పూర్తి చేసుకునేందుకు సహాయం పొందవచ్చని తెలిపారు. కువైట్‌లో కొనసాగుతున్న విస్తృత డిజిటల్ మార్పు దిశకు అనుగుణంగానే పీఏసీఐ తన సేవలను డిజిటలైజ్ చేస్తోందని, పౌరులు, నివాసితులకు మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com