యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- October 09, 2026
అబుదాబి: ఆత్మహత్యాయత్నాన్ని నేరంగా పరిగణించకుండా యూఏఈ ప్రభుత్వం కీలక చట్ట సవరణను తీసుకొచ్చింది. దేశంలోని క్రైమ్స్ అండ్ పెనాల్టీస్ చట్టంలో చేసిన ఈ మార్పులను గురువారం ప్రకటించారు. కొత్త సవరణ ప్రకారం, ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి శిక్షించే బదులు, వారిని నివారణ, చికిత్స, మానవతా దృక్పథంతో ఆదుకునే విధానానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.చట్టపరమైన చర్యల భయం తగ్గడం ద్వారా మానసిక సంక్షోభంలో ఉన్న వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు సకాలంలో సహాయం కోరేందుకు ఈ మార్పు దోహదపడుతుందని ప్రభుత్వం తెలిపింది. తద్వారా ముందస్తు జోక్యం, అవసరమైన వైద్యం, మానసిక సహాయం అందించే అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొంది.అలాగే ఇలాంటి ఘటనలకు సంబంధించిన కేసులు, డేటాను మెరుగ్గా పర్యవేక్షించడం ద్వారా భవిష్యత్తులో నివారణ, చికిత్సా కార్యక్రమాలను మరింత సమర్థంగా రూపొందించేందుకు వీలు కలుగుతుందని ప్రభుత్వం తెలిపింది.
గతంలో శిక్ష ఇలా ఉండేది
గతంలో యూఏఈ చట్టాల ప్రకారం ఆత్మహత్యాయత్నం మిస్డీమీనర్ (జున్హా) నేరంగా పరిగణించబడేది. గరిష్ఠంగా ఆరు నెలల జైలు శిక్ష, 5,000 దిర్హమ్స్ వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉండేది. ప్రత్యామ్నాయంగా కోర్టు వైద్య చికిత్సకు పంపే ఆదేశాలు కూడా ఇవ్వగలిగేది. మరోవైపు తాజా సవరణను న్యాయ నిపుణులు స్వాగతించారు. మానసిక సంక్షోభంలో ఉన్న వారికి శిక్ష కంటే అవసరమైన వైద్యం, సహాయం అందించేందుకు ఈ మార్పు దోహదపడుతుందని వారు పేర్కొన్నారు.
2020లోనే స్వీయ హానిపై మార్పులు
యూఏఈ 2020లోనే పెనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్స్ చట్టాల్లో మార్పులు చేసింది. ఇతరులకు హాని కలిగించకుండా కేవలం తమకు తాము హాని చేసుకునే చర్యలను నేరంగా పరిగణించకుండా, స్వీయ హానికి పాల్పడిన వ్యక్తులను మానసిక ఆరోగ్య చికిత్సకు పంపే విధానాన్ని అప్పట్లో ప్రవేశపెట్టింది. తాజా సవరణతో ఆత్మహత్యాయత్నంపై ఉన్న క్రిమినల్ శిక్షను కూడా తొలగించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







