సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- October 09, 2026
రియాద్: సౌదీ అరేబియాలో కార్మికుల వసతి విషయంలో కొత్త నిబంధనలను Qiwa ప్లాట్‌ఫామ్ వెల్లడించింది. 20 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్న సంస్థలు, నిర్దేశిత వృత్తుల్లో ఉన్న ఉద్యోగులకు తప్పనిసరిగా లైసెన్స్ పొందిన షేర్డ్ హౌసింగ్ కల్పించాల్సి ఉంటుంది. సౌదీ స్టాండర్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆక్యుపేషన్స్ ప్రకారం ఈ నిబంధనలు 4 వృత్తి విభాగాలకు చెందిన 527 రకాల ఉద్యోగాలకు వర్తిస్తాయి.
వీటిలో:
- వ్యవసాయం, అటవీ, చేపల పెంపక రంగాల్లో నైపుణ్యం కలిగిన కార్మికులకు చెందిన 53 ప్రొఫెషన్స్.
- క్రాఫ్ట్స్, సంబంధిత ట్రేడ్స్‌కు చెందిన 179 ప్రొఫెషన్స్.
- ఫ్యాక్టరీ, మెషిన్ ఆపరేటర్లు, అసెంబ్లీ కార్మికులకు చెందిన 218 ప్రొఫెషన్స్.
- ప్రాథమిక స్థాయి పనులకు చెందిన 77 ప్రొఫెషన్స్ ఉన్నాయి.
ఈ ప్రొఫెషన్స్ సౌదీ ఆక్యుపేషనల్ క్లాసిఫికేషన్లోని 6, 7, 8, 9 కేటగిరీల పరిధిలోకి వస్తాయని Qiwa తెలిపింది.
జీతంతో హౌసింగ్ అలవెన్స్ ఇచ్చినా మినహాయింపు లేదు
నిర్దేశిత ప్రొఫెషన్స్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతంలో భాగంగా హౌసింగ్ అలవెన్స్ చెల్లించడం ద్వారా సంస్థలకు ఈ బాధ్యత నుంచి మినహాయింపు లభించదని Qiwa స్పష్టం చేసింది. అలాంటి ఉద్యోగులకు తప్పనిసరిగా లైసెన్స్ పొందిన షేర్డ్ వసతి కల్పించాలి. అయితే, నిబంధనల్లో పేర్కొనని ఇతర ప్రొఫెషన్స్ లో పనిచేసే ఉద్యోగులకు సంస్థలు వసతి కల్పించవచ్చు లేదా హౌసింగ్ అలవెన్స్ చెల్లించవచ్చు. షేర్డ్ హౌసింగ్ కల్పించే సంస్థలు సంబంధిత సాంకేతిక, ఆరోగ్య ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని Qiwa సూచించింది. కార్మికులకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన నివాస వాతావరణం కల్పించడమే ఈ నిబంధనల ప్రధాన ఉద్దేశమని పేర్కొంది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







