రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!

- October 09, 2026 , by Maagulf
రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!

రస్ అల్ ఖైమా: యూఏఈలోని రస్ అల్ ఖైమాలో కనిపించకుండా పోయిన ఎమిరాతీ మహిళ షైఖా మృతి చెందినట్లు రస్ అల్ ఖైమా పోలీసులు ధృవీకరించారు. షైఖా కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె కనిపించకుండా పోయిన విషయాన్ని గురువారం ఉదయం అధికారులు ప్రజలకు తెలియజేసి, ఆచూకీ కోసం సహకరించాలని కోరారు. అనంతరం ఆమె మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.
అయితే ఆమె ఎక్కడ, ఎలా మృతి చెందారన్న దానిపై అధికారులు ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. షైఖా కుటుంబ సభ్యులకు రస్ అల్ ఖైమా పోలీసులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతకుముందు ఆమె ఆచూకీ కోసం పోలీసులు ప్రజల సహకారం కోరినప్పటికీ, ఆమె ఎప్పుడు కనిపించకుండా పోయారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com