లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- October 10, 2026
దోహా: ఖతార్‌లోని లుసైల్ బౌలేవార్డ్ (దర్బ్ లుసైల్ స్ట్రీట్), అల్ సాద్ స్క్వేర్ ప్రాంతాల్లో నేడు తాత్కాలికంగా ట్రాఫిక్‌ను నిలిపివేయనున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) ప్రకటించింది.
మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. అర్ధరాత్రి 12 గంటల నుంచి అదే రోజు రాత్రి 11:59 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. దాదాపు 24 గంటల పాటు రహదారులపై రాకపోకలు నిలిచిపోనున్నాయి.
ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో వాహనదారులు రహదారులపై ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సూచికలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. మూసివేసిన మార్గాలకు బదులుగా ప్రత్యామ్నాయ రహదారులను వినియోగించాలని కోరారు.
ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, రహదారి భద్రతను నిర్ధారించడం కోసం వాహనదారులు ముందుగానే తమ ప్రయాణాలను ప్రణాళిక చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







