లుసైల్ బౌలేవార్డ్‌పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!

- October 10, 2026 , by Maagulf
లుసైల్ బౌలేవార్డ్‌పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!

దోహా: ఖతార్‌లోని లుసైల్ బౌలేవార్డ్‌ (దర్బ్ లుసైల్ స్ట్రీట్‌), అల్ సాద్ స్క్వేర్‌ ప్రాంతాల్లో నేడు  తాత్కాలికంగా ట్రాఫిక్‌ను నిలిపివేయనున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) ప్రకటించింది.

మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. అర్ధరాత్రి 12 గంటల నుంచి అదే రోజు రాత్రి 11:59 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. దాదాపు 24 గంటల పాటు రహదారులపై రాకపోకలు నిలిచిపోనున్నాయి.

ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో వాహనదారులు రహదారులపై ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సూచికలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. మూసివేసిన మార్గాలకు బదులుగా ప్రత్యామ్నాయ రహదారులను వినియోగించాలని కోరారు.

ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, రహదారి భద్రతను నిర్ధారించడం కోసం వాహనదారులు ముందుగానే తమ ప్రయాణాలను ప్రణాళిక చేసుకోవాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com