CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్

- October 10, 2026 , by Maagulf
CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్

న్యూ ఢిల్లీ: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శనివారం నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా సీజేపీ జాతీయ అధ్యక్షుడు అభిజీత్ దీప్కేను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విమానంలో ఢిల్లీకి చేరుకున్న ఆయనను విమానం ఫ్లైట్ లోపలే ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

20 వేల మందితో కట్టుదిట్టమైన భద్రత
జంతర్ మంతర్ వద్ద నిర్వహించ తలపెట్టిన నిరసన ప్రదర్శనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఢిల్లీ వ్యాప్తంగా దాదాపు 20 వేల మంది భద్రతా సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జంతర్ మంతర్ పరిసరాల్లో ఏడు అంచెల బారికేడ్లను నిర్మించడంతో పాటు సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా పెట్టారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఢిల్లీలోని 57 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే 250కి పైగా రైళ్లను రద్దు చేయడంతో పాటు, జన్‌పథ్‌-కర్తవ్య మార్గ్‌ పరిసరాల్లో నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. మహిళా నిరసనకారులను నియంత్రించేందుకు ప్రత్యేకంగా ‘పింక్ ఫోర్స్‌’ను కూడా రంగంలోకి దించారు.

నిరసనకు అనుమతి నిరాకరణకు పోలీసుల వివరణ
గత నిరసనల సందర్భంగా ఇచ్చిన హామీలను నిబంధనలకు విరుద్ధంగా ఉల్లంఘించడమే కాకుండా, ప్రజాభద్రత, శాంతిభద్రతల దృష్ట్యా ఈ ఆందోళనకు అనుమతి ఇవ్వలేదని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.అంతేకాకుండా, జంతర్ మంతర్ వద్ద ఏదైనా నిరసన చేపట్టడానికి కనీసం 10 రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా, సీజేపీ కేవలం 3 రోజుల ముందే దరఖాస్తు చేసుకుందని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com