ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- October 12, 2026
రియాద్: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హూతీ మిలీషియా దాడి చేయడంపై సర్వత్రా భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనతో ఉమ్రా యాత్రికులు, కుటుంబాలు, ఇతర ప్రయాణికుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
సౌదీ అరేబియాలోని మక్కా, మదీనా పవిత్ర నగరాలకు వెళ్లే లక్షలాది మంది ముస్లిం యాత్రికులకు విమానాశ్రయాలు కీలక రవాణా కేంద్రాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పౌర విమానయాన మౌలిక సదుపాయాలపై దాడులు యాత్రికుల ప్రయాణ భద్రతకు ముప్పుగా మారవచ్చని భావిస్తున్నారు.
గత దాడులపై మళ్లీ చర్చ
మక్కా, మదీనా వైపు గతంలో జరిగినట్లు పేర్కొన్న హూతీ దాడులను కూడా ఈ ఘటన మరోసారి చర్చకు తెచ్చింది. పవిత్ర నగరాలకు వచ్చే యాత్రికులు, సందర్శకులు, వారికి సేవలందించే పౌర మౌలిక సదుపాయాల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దాడి అనంతరం సోషల్ మీడియాలో ప్రసారమైన దృశ్యాల్లో విమానాలు ఎక్కేందుకు సిద్ధమవుతున్న ఉమ్రా యాత్రికులు కనిపించారు.
పౌర విమానయాన భద్రతపై ఆందోళన
విమానాశ్రయాలపై దాడులు విమాన రాకపోకలకు అంతరాయం కలిగించడమే కాకుండా, మహిళలు, చిన్నారులు, యాత్రికులు సహా సాధారణ ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదం కలిగించవచ్చని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
యెమెన్‌లో సైనిక ఒత్తిడి నేపథ్యంలో దాడులు?
యెమెన్‌లో హూతీ దళాలపై సైనిక ఒత్తిడి పెరుగుతున్న సమయంలో సౌదీ అరేబియాలోని పౌర సదుపాయాలపై దాడులు వారి శక్తిని చాటుకునే ప్రయత్నం కావచ్చని యుద్ధ రంగ నిపుణులు చెబుతున్నారు.
యాత్రికుల రక్షణకు ప్రాధాన్యం
రెండు పవిత్ర మసీదుల సంరక్షక దేశంగా సౌదీ అరేబియా యాత్రికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని అధికార యత్రాంగం చెబుతోంది. విమానాశ్రయాలు, రవాణా వ్యవస్థలు, భద్రతా ఏర్పాట్లను పటిష్ఠం చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా వచ్చే ముస్లింలు సురక్షితంగా తమ మతపరమైన విధులను నిర్వహించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది. పౌర విమానయాన కేంద్రాలకు రక్షణ కల్పించడం, దాడులకు బాధ్యులైన వారిని జవాబుదారీగా నిలపడం అవసరమని అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







