వినోద్‌ రాయల్‌ కుటుంబాన్ని పవన్‌కల్యాణ్‌..

- August 24, 2016 , by Maagulf
వినోద్‌ రాయల్‌ కుటుంబాన్ని పవన్‌కల్యాణ్‌..

ర్ణాటకలో ఇటీవల హత్యకు గురైన తన అభిమాని వినోద్‌ రాయల్‌ కుటుంబాన్ని సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఈరోజు పరామర్శించారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకున్న ఆయన అక్కడి నుంచి రోడ్డుమార్గంలో తిరుపతికి చేరుకున్నారు. వినోద్‌ కుటుంబసభ్యులను పరామర్శించి ఘటన వివరాలను తెలుసుకున్నారు. కన్నీటి పర్యంతమైన వినోద్‌ కుటుంబసభ్యులను ఓదార్చి వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కర్ణాటకలో మూడు రోజుల క్రితం వినోద్‌ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కోలారులో జరిగిన ఓ కార్యక్రమంలో ఘర్షణ తలెత్తి వేరే హీరో అభిమాని అయిన యువకుడు పవన్‌ అభిమాని అయిన వినోద్‌ను కత్తితో పొడిచాడు.తీవ్ర రక్తస్రావమైన వినోద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. తన అభిమాని హత్య విషయం తెలుసుకున్న పవన్‌కల్యాణ్‌ ఈరోజు తిరుపతికి చేరుకుని అతడి కుటుంబాన్ని పరామర్శించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com