వినోద్ రాయల్ కుటుంబాన్ని పవన్‌కల్యాణ్..
- August 24, 2016
కర్ణాటకలో ఇటీవల హత్యకు గురైన తన అభిమాని వినోద్ రాయల్ కుటుంబాన్ని సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఈరోజు పరామర్శించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకున్న ఆయన అక్కడి నుంచి రోడ్డుమార్గంలో తిరుపతికి చేరుకున్నారు. వినోద్ కుటుంబసభ్యులను పరామర్శించి ఘటన వివరాలను తెలుసుకున్నారు. కన్నీటి పర్యంతమైన వినోద్ కుటుంబసభ్యులను ఓదార్చి వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కర్ణాటకలో మూడు రోజుల క్రితం వినోద్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కోలారులో జరిగిన ఓ కార్యక్రమంలో ఘర్షణ తలెత్తి వేరే హీరో అభిమాని అయిన యువకుడు పవన్ అభిమాని అయిన వినోద్‌ను కత్తితో పొడిచాడు.తీవ్ర రక్తస్రావమైన వినోద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. తన అభిమాని హత్య విషయం తెలుసుకున్న పవన్‌కల్యాణ్ ఈరోజు తిరుపతికి చేరుకుని అతడి కుటుంబాన్ని పరామర్శించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







