పారా ఒలింపిక్స్ టికెట్లు అమ్మకాలు రికార్డు స్థాయిలో...
- August 25, 2016
రియో డీ జనీరో: వచ్చే నెలలో రియోలో ఆరంభం కానున్న పారా ఒలింపిక్స్ నేపథ్యంలో అక్కడ అప్పుడే టికెట్ల అమ్మకాల సందడి ఊపందుకుంది. గతవారం ముగిసిన రియో ఒలింపిక్స్ విజయవంతం కావడంతో పారా ఒలింపిక్స్ ను చూసేందుకు అభిమానులు పోటీ పడుతున్నారు. పారా ఒలింపిక్స్ టికెట్లు అమ్మకాలు మొదలుపెట్టిన నాలుగు రోజుల్లోనే దాదాపు మూడు లక్షల టికెట్లు అమ్మడైపోయాయి. గత మంగళవారం ఒక్క రోజే లక్షా ముప్పై మూడు వేల టికెట్లు అమ్ముకావడంతో సరికొత్త రికార్డు నమోదయ్యింది. రియో ఒలింపిక్స్ లో ఒక్క రోజులోనే అత్యధిక సంఖ్యలో టికెట్లను విక్రయించడం ఇదే ప్రథమం.
'గడిచిన 48 గంటల్లో టికెట్లు అమ్మకాలు రెట్టింపు అయ్యాయి. ఇలా పారా ఒలింపిక్ టికెట్లకు డిమాండ్ పెరగడం గేమ్స్నిర్వహణకు ప్రోత్సాహకంగా ఉంది.
తొలి రోజు పదహారు వేల టికెట్లు అమ్ముడుపోగా, రెండో రోజు యాభై టికెట్లు అమ్ముడయ్యాయి. ఇక మూడు, నాలుగు రోజుల్లో లక్షల సంఖ్యలో టికెట్లను విక్రయించాం'అని అంతర్జాతీయ పారా ఒలింపిక్ కమిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోన్జాలెజ్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







