ట్రాఫిక్ ప్రమాదంలో భారతీయుడు మృతి

- August 25, 2016 , by Maagulf
ట్రాఫిక్ ప్రమాదంలో భారతీయుడు మృతి

భారత జాతీయుడైన  మిధుఫా కువైట్ లోని ఫర్వాణీయ ప్రాంతంలో ఒక విషాద ప్రమాదంలో మృతిచెందారు. 39 ఏళ్ళ  వయస్సు గల  మిధుఫా కేరళ ప్రాంతానికి  కోజికోడ్ జిల్లావాసి  తన సొంత వ్యాపారాన్ని కువైట్ లో గత కొంతకాలంగా నిర్వహిషున్నాడు. అయితే మిధుఫా గురువారం ఉదయం ఫర్వాణీయ హబీబ్ మునావర్ వీధి నుండి  ఒక  ' యు ' మలుపు తిరుగుతోండగా మరొక కారులోని పౌరుడు    అతని కారుని బలంగా  ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మరణించిన మిధుఫాకు భార్య వహీదా తో పాటు మరియు  లాహ్మత్ , ఆయిషా మిన్హా  ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com