జిలీబ్‌లో ఫేక్‌ డొమెస్టిక్‌ హెల్ప్‌ ఆఫీస్‌

- August 25, 2016 , by Maagulf
జిలీబ్‌లో ఫేక్‌ డొమెస్టిక్‌ హెల్ప్‌ ఆఫీస్‌

బోగస్‌ డొమెస్టిక్‌ హెల్ప్‌ ఆఫీస్‌ని జిలీబ్‌ అల్‌ షుయియుఖ్‌లో రెసిడెన్సీ డిటెక్టివ్స్‌ కనుగొన్నారు. దీన్ని నిర్వహిస్తోన్న పలువురు వలసదారుల్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన సమాచారం అందుకోగానే, ఆ సమాచారం సరైనదేనని నిర్ధారించుకున్న అధికారులు, వ్యూహాత్మకంగా ఆ ఆఫీస్‌పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలువురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయినవారిలో ఐదుగురు ఇథియోపియన్లు, ఐదుగురు కెమెరూనియన్స్‌, ముగ్గురు ఘనైయాన్స్‌, ముగ్గురు బెనైనెన్స్‌ఉన్నారు. వీరెవరికీ గుర్తింపు కార్డులు లేవు. మరో ఆరుగురు వారి స్పాన్సర్స్‌ నుంచి తప్పించుకు తిరుగుతున్నవారినీ గుర్తించారు. రోజువారీ పనులు చేసుకుంటూ ఉంటామనీ, ఆ పనులు లేనప్పుడు ఇలాంటి పనులు చేస్తుంటామని నిందితులు ఒప్పుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com