యూఏఈలో ఎన్టీయార్‌ 'గ్యారేజ్‌' రికార్డ్‌

- August 25, 2016 , by Maagulf
యూఏఈలో ఎన్టీయార్‌ 'గ్యారేజ్‌' రికార్డ్‌

ఎన్టీయార్‌ హీరోగా నటించిన 'జనతా గ్యారేజ్‌' సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. సెప్టెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని యూఏఈలో రికార్డు స్థాయిలో విడుదల చేస్తున్నారు. మొత్తం 48 లొకేషన్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండడం విశేషం. గల్ఫ్‌ దేశాల్లో ఇదే ఏ తెలుగు చిత్రానికైనా రికార్డ్‌. ఓవర్సీస్‌ మార్కెట్‌లో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. నిత్యామీనన్‌, సమంత ఈ చిత్రంలో ఎన్టీయార్‌ సరసన హీరోయిన్లుగా నటించగా, ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com