తెలివైన తాబేలు
- July 29, 2015
ఒక వేటగాడు వేట కోసం అడవంతా తిరిగి, తిరిగి ఏమీ దొరక్క అలసిపోయి ఒక చెరువు దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ ఒక తాబేలు అత్యంత మధురంగా పిల్లనగ్రోవి వాయిస్తుండడం చూసి దాని దగ్గరకు వెళ్లి దాన్ని బంధించి తన బుట్టలో వేసుకున్నాడు. తాబేలు తనను తాను మరిచిపోయి పిల్లనగ్రోవి వాయించడంలో ఉండిపోయింది. వేటగాడికి దొరికిపోయింది. వేటగాడు దాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకుపోయి, తన భార్య,పిల్లలతో ఈ తాబేలు సంగీతంతో మనం వీధిల్లో చాలా డబ్బులు సంపాదించొచ్చు. దీన్ని జాగ్రత్తగా చూసుకొండి. నేను దీనికి ఒక పంజరం తీసుకుని వస్తాను. అని బజారుకు బయలుదేరాడు. అతను అలా వెళ్లగానే వేటగాని పిల్లల్ని ఆకర్షించేలా మంచి సంగీతాన్ని పిల్లనగ్రోవితో పాడి వినిపించింది. అందుకు ఆ పిల్లలు చాలా సంతోషంతో డాన్సులు చేశారు. అప్పుడు ఆ తాబేలు నన్ను బయటికి తీస్తే నేను మరింత మధురంగా పిల్లనగ్రోవి ఊదగలను అంది. అందుకు ఆ పిల్లలు దాన్ని ఉంచిన బాక్సు నుంచి బయటికి తీసి కింద పెట్టారు. అప్పుడది మరింత బాగా పిల్లనగ్రోవి వాయించింది. పిల్లలు చెమటలు పట్టి అలసిపోయేలా దాని పాటకి ఆడి పాడి గెంతులేశారు. అప్పుడు ఆ తాబేలు మనం బాగా అలసిపోయాం కదా...పదండి స్నానం చేద్దాం అంది. అందుకు ఆ పిల్లలు దానికి ఒక బకెట్లో నీళ్లు పోసి తీసుకువచ్చారు. అందుకు తాబేలు నాకీ నీళ్లు సరిపోవు. పదండి నది దగ్గరకు వెళ్లి ఎంజాయ్ చేస్తూ స్నానం చేసి వద్దాం అంది. అందుకు ఆ పిల్లలు దాన్ని తీసుకుని నది వద్దకు వెళ్లి నదిలోనికి దిగగా తాబేలు ఒక్క ఉదుటున గెంతి నదిలో తప్పించుకుని పారిపోయింది.
నీతి - అపాయం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఆలోచనతో అపాయాన్ని తప్పించువడానికి ప్రయత్నం చేయాలి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







