రియాద్ లో దొంగల ముఠా కదలిక పై పోలీస్ అప్రమత్తం
- August 25, 2016
రియాడ్: పోలీసులు ఇటీవల ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో బ్యాంకు వినియోగదారులకు దోచుకొన్న 12 మంది సభ్యులు గల ఒక ముఠాని అరెస్టు చేశారు. ఆ తరహాలోనే రియాద్ లో దొంగల ముఠా సంచరిస్తున్నదని పేర్కొన్నారు. రియాద్ పోలీసు ప్రతినిధి కల్నల్ ఫరజ్ అల్ మైమన్ మాట్లాడుతూ దొంగలు అద్దెకు కార్లను తీసుకొని పగలంతా నగరం చుట్టూ తిరిగి దొంగతనం చేసే ఉద్దేశంతో అవకాశం కోసం ఎదురుచూసి దోచుకోనున్నారు అని తెలిపారు.
"ప్రాధమిక విచారణ మేరకు పోలీసులు అనుమానితులు నగరంలో కత్తులు మరియు ఇతర మారణాయుధాలతో బెదిరించడం తరువాత 15 మందిని దోచుకున్నారని " ఆల్-మైమన్ చెప్పారు. అతను అనుమానితులను గుర్తించకుండా ఉండేందుకు అద్దెకు కార్లు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఈ బృందంలో తొమ్మిది మంది ఇథోపియన్లు , ఇద్దరు ఈజిప్షియన్లు మరియు ఒక సూడాన్ వ్యక్తి ఈ గ్యాంగ్ లో ఉన్నట్లు తెలిపారు. వీరంతా ఇరవై ఏళ్ళ ప్రాయం వారని తెలిపారు. అల్ మైమన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, పౌరులు బ్యాంకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కోరారు. అదనపు పహారా పెంచినట్లు ఆయన వివరించారు. నగరంలో ఉన్న నివాసితులు జాగ్రత్తగా ఉండాలని కోరారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







