రియాద్ లో దొంగల ముఠా కదలిక పై పోలీస్ అప్రమత్తం

- August 25, 2016 , by Maagulf
రియాద్ లో  దొంగల ముఠా కదలిక పై పోలీస్ అప్రమత్తం

రియాడ్: పోలీసులు ఇటీవల ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో బ్యాంకు వినియోగదారులకు దోచుకొన్న 12 మంది సభ్యులు గల ఒక ముఠాని  అరెస్టు చేశారు. ఆ తరహాలోనే రియాద్ లో  దొంగల ముఠా సంచరిస్తున్నదని పేర్కొన్నారు. రియాద్ పోలీసు ప్రతినిధి కల్నల్ ఫరజ్  అల్ మైమన్ మాట్లాడుతూ  దొంగలు అద్దెకు కార్లను తీసుకొని  పగలంతా నగరం చుట్టూ తిరిగి  దొంగతనం చేసే ఉద్దేశంతో  అవకాశం కోసం ఎదురుచూసి దోచుకోనున్నారు అని తెలిపారు. 

"ప్రాధమిక విచారణ మేరకు పోలీసులు అనుమానితులు నగరంలో  కత్తులు మరియు ఇతర మారణాయుధాలతో బెదిరించడం తరువాత 15 మందిని  దోచుకున్నారని " ఆల్-మైమన్  చెప్పారు. అతను అనుమానితులను గుర్తించకుండా ఉండేందుకు అద్దెకు కార్లు ఉపయోగిస్తున్నట్లు  తెలిపారు. ఈ బృందంలో   తొమ్మిది మంది  ఇథోపియన్లు , ఇద్దరు ఈజిప్షియన్లు మరియు ఒక సూడాన్ వ్యక్తి  ఈ  గ్యాంగ్ లో ఉన్నట్లు తెలిపారు. వీరంతా ఇరవై ఏళ్ళ ప్రాయం వారని తెలిపారు. అల్ మైమన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, పౌరులు  బ్యాంకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కోరారు. అదనపు పహారా పెంచినట్లు ఆయన వివరించారు. నగరంలో ఉన్న  నివాసితులు జాగ్రత్తగా ఉండాలని  కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com