క్యాంపింగ్ సీజన్‌లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!

- October 18, 2026 , by Maagulf
క్యాంపింగ్ సీజన్‌లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!

దోహా: క్యాంపింగ్ సీజన్ నేపథ్యంలో కారవాన్లు, ట్రైలర్లను తరలించే సమయాలను ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) ప్రకటించింది. రహదారి భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సమయాలను నిర్దేశించడంతో పాటు వాహనదారులు పాటించాల్సిన నిబంధనలను వెల్లడించింది.

మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివారం నుంచి బుధవారం వరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కారవాన్లు, ట్రైలర్లను తరలించేందుకు అనుమతి ఉంటుంది. గురువారం నుంచి శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది.కారవాన్లు, ట్రైలర్లను లాగే వాహనదారులు రహదారిపై కుడివైపు లేన్‌లోనే ప్రయాణించాలని అధికారులు సూచించారు. పొగమంచు లేదా విజిబిలిటీ తక్కువగా ఉన్న సమయంలో వాటిని తరలించవద్దని స్పష్టం చేశారు.

అలాగే, కారవాన్లు, ట్రైలర్లను లాగుతూ ప్రయాణించే సమయంలో ఇతర వాహనాలను ఓవర్‌టేక్ చేయకూడదని సూచించారు. క్యాంపింగ్ సీజన్‌లో ఈ వాహనాలతో ప్రయాణించేవారు ఆర్బిటల్ హైవే, దానికి అనుసంధానమైన రహదారులను వినియోగించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు, ప్రయాణికుల భద్రతను కాపాడేందుకు వాహనదారులు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com