ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- October 18, 2026
ముఖ్య అతిథిగా భారత రాయబారి డాక్టర్ కె.శ్రీకర్ రెడ్డి..యువత సాధికారతలో విద్య పాత్రపై ప్రత్యేక చర్చ
దోహా: ఖతార్లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం (AMUAAQ) ఆధ్వర్యంలో సర్ సయ్యద్ డే 2026 వేడుకలు ఘనంగా నిర్వహించారు. అక్టోబర్ 16న దోహాలోని సిటీ సెంటర్ రొటానా హోటల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఖతార్లో భారత రాయబారి డాక్టర్ కె. శ్రీకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
విద్యతోనే యువత సాధికారత
‘విద్యా శక్తి: తదుపరి తరానికి సాధికారత’ (The Power of Education: Empowering the Next Generation) అనే ఇతివృత్తంతో ఈ వేడుకలను నిర్వహించారు. యువత భవిష్యత్తును తీర్చిదిద్దడంలో, వారిలో నైపుణ్యాలను పెంపొందించడంలో, సమాజ అభివృద్ధికి అవసరమైన అవకాశాలను కల్పించడంలో విద్య పోషించే కీలక పాత్రను ఈ కార్యక్రమం ప్రధానంగా చాటిచెప్పింది.
విద్య వ్యక్తుల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడమే కాకుండా, భావితరాల అభివృద్ధికి పునాది వేస్తుందని ఈ వేడుకల ద్వారా వివరించారు.
అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం నిర్వహించిన ఈ కార్యక్రమం విద్య ప్రాధాన్యతను చాటిచెప్పడంతో పాటు, యువతను సాధికారత దిశగా ప్రోత్సహించే లక్ష్యంతో సాగింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి, ఖతార్)
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







