ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!

- October 18, 2026 , by Maagulf
ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!

మస్కట్: ఒమన్‌లోని అల్ అవాబి ప్రాంతంలో ఓ ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన సౌత్ అల్ బతీనా గవర్నరేట్ పరిధిలోని విలాయత్ అల్ అవాబిలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అగ్నిప్రమాదంలో గాయపడిన ఆరుగురిని చికిత్స నిమిత్తం ఆరోగ్య కేంద్రాలకు తరలించారు.

ఈ ఘటనపై ఒమన్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేయడంతో పాటు, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com