కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- October 18, 2026
మిడిల్ ఈస్ట్ భద్రత, ప్రాంతీయ స్థిరత్వంపై ఇరు దేశాల నేతల సమాలోచనలు
అబుదాబి: యూఏఈ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కువైట్ విదేశాంగ మంత్రి షేక్ జర్రాహ్ జాబర్ అల్ అహ్మద్ అల్ సబాతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలతో పాటు మధ్యప్రాచ్యంలో భద్రత, స్థిరత్వాన్ని బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యల పై ఇరువురు చర్చించారు.
యూఏఈ, కువైట్ దేశాల మధ్య ఉన్న దీర్ఘకాలిక సోదర సంబంధాలకు సంబంధించిన పలు అంశాలను కూడా ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సమీక్షించారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.
మిడిల్ ఈస్ట్ లో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రాంతీయ భద్రత, స్థిరత్వాన్ని పెంపొందించేందుకు ఇరు దేశాల మధ్య సంప్రదింపులు, సహకారాన్ని కొనసాగించడంపై ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







