కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- October 20, 2026
కువైట్ : కువైట్‌లోని పాఠశాలల విద్యా ప్రణాళికలో చైనీస్ భాషను ఐచ్ఛిక సబ్జెక్టుగా ప్రవేశపెట్టేందుకు విద్యా మంత్రిత్వ శాఖ చర్యలు చేపడుతోంది. ఈ విషయంలో విదేశాంగ మంత్రిత్వ శాఖతో కలిసి ప్రణాళికలు రూపొందిస్తోంది. చైనాతో విద్యా, సాంస్కృతిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ ప్రతిపాదన ప్రధాన ఉద్దేశమని వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులకు చైనీస్ భాష నేర్చుకునే అవకాశం కల్పించడంతో పాటు, వారి భాషా నైపుణ్యాలను పెంపొందించాలని అధికారులు భావిస్తున్నారు.
కువైట్, చైనా చరిత్రపై పాఠాలు
చైనీస్ భాష బోధనతోపాటు కువైట్, చైనా దేశాల చరిత్ర, భౌగోళిక అంశాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా పాఠ్యాంశాల్లో చేర్చాలని ప్రతిపాదిస్తున్నారు. దీనివల్ల రెండు దేశాల సంస్కృతి, చారిత్రక నేపథ్యం, భౌగోళిక పరిస్థితులపై విద్యార్థులకు అవగాహన పెరుగుతుందని భావిస్తున్నారు.
ఉపాధ్యాయులకు శిక్షణ
విద్యారంగంలో పరస్పర సహకారాన్ని పెంచుకునేందుకు శిక్షణ తరగతులు, విద్యా వర్క్‌షాప్‌లు, వార్షిక శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనే అంశాలను కూడా ఇరు పక్షాలు పరిశీలిస్తున్నాయి. ఈ కార్యక్రమాల ద్వారా విద్యా రంగంలో పనిచేసే సిబ్బంది వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే కువైట్ విద్యార్థులకు కొత్త విదేశీ భాష నేర్చుకునే అవకాశం లభించడంతో పాటు, చైనాతో విద్యా, సాంస్కృతిక సంబంధాలు మరింత విస్తరించే అవకాశం ఉంటుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!







