ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!

- October 20, 2026 , by Maagulf
ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!

మస్కట్: ఒమన్‌లోని నార్త్ అల్ బతీన్హా గవర్నరేట్ పరిధిలో విద్యుత్ కేబుళ్లు, వైర్ల చోరీలకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. లివా విలాయత్‌లో ఐదు చోరీ ఘటనలకు సంబంధించి ఈ అరెస్ట్ చేసినట్లు నార్త్ అల్ బతీన్హా గవర్నరేట్ పోలీస్ కమాండ్ వెల్లడించింది.

ఒక వాణిజ్య సంస్థతో పాటు నిర్మాణంలో ఉన్న పలు ఇళ్ల నుంచి విద్యుత్ కేబుళ్లు, వైర్లను దొంగిలించినట్లు నిందితుడిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలకు సంబంధించి నిందితుడిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లలో విద్యుత్ పరికరాలు, కేబుళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com