ప్రధాని మోదీపై పశ్చిమబెంగాల్ సిఎం సంచలన వ్యాఖ్యలు....

- August 26, 2016 , by Maagulf
ప్రధాని మోదీపై పశ్చిమబెంగాల్ సిఎం సంచలన వ్యాఖ్యలు....

ప్రధాని మోదీపై పశ్చిమబెంగాల్ సిఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమబెంగాల్‌కు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ప్రధాని ఇవ్వడం లేదని ఆరోపించారు. నిధులిమ్మంటే లేవంటున్నారని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్‌కు రావాల్సిన నిధులను ఇవ్వకుండా ఏం చేసుకుంటారని ప్రశ్నిస్తూ సూట్లు కుట్టించుకుంటారా అని ఎద్దేవా చేశారు. పశ్చిమబెంగాల్ వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం మానెయ్యకపోతే మూడు నెలల తర్వాత ఢిల్లీ వీధుల్లో ఆందోళనకు దిగుతానని మమత హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com