అమితాబ్ బచ్చన్ నివాసం, మేయర్ ఆఫీస్‌కు బాంబు బెదిరింపులు

- October 23, 2026 , by Maagulf
అమితాబ్ బచ్చన్ నివాసం, మేయర్ ఆఫీస్‌కు బాంబు బెదిరింపులు

ముంబై: ముంబయిలోని పలు కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులు జరుపుతామంటూ దుండగులు పంపిన ఈ-మెయిల్స్ తీవ్ర కలకలం సృష్టించాయి. బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ప్రధాన కార్యాలయంలోని మేయర్ ఆఫీస్‌తో పాటు, ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నివాసం ‘జల్సా’, గాయకుడు దిల్జిత్ దోసాంజ్ కచేరీ వేదికలను పేల్చివేస్తామని బెదిరింపులు వచ్చాయి. అక్టోబర్ 31 మరియు నవంబర్ 27 తేదీల్లో ఈ దాడులు నిర్వహిస్తామని ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు.

ఖలిస్థాన్ సంస్థల పేర్లతో హెచ్చరికలు

ముంబయి డిప్యూటీ మేయర్ సంజయ్ ఘాడీకి వచ్చిన ఈ-మెయిల్‌లో ఖలిస్థాన్ నేషనల్ ఆర్మీ, బబ్బర్ ఖల్సా వంటి నిషేధిత సంస్థల పేర్లను దుండగులు ప్రస్తావించారు. 1984 అల్లర్లకు ప్రతీకారం తీర్చుకుంటామని, మేయర్ ఆఫీస్, అమితాబ్ నివాసం, పాఠశాలలు మరియు మహాలక్ష్మి రేస్‌కోర్స్‌లను పేల్చివేస్తామని బెదిరించారు. దీనితో పాటు గురునానక్ సింగ్, డాక్టర్ గుర్నీర్వర్ సింగ్ మొదలైన పలువురి పేర్లను కూడా ఆ మెయిల్‌లో పేర్కొన్నారు. బెదిరింపు సమాచారం అందుకున్న వెంటనే భద్రతా సిబ్బంది మరియు బాంబు స్క్వాడ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. మేయర్ కార్యాలయం మరియు ఇతర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టగా, ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ-మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే అంశం పై పోలీసులు, సైబర్ క్రైమ్ టీమ్ దర్యాప్తు వేగవంతం చేశాయి. ముందస్తు జాగ్రత్త చర్యగా అమితాబ్ నివాసంతో పాటు నగరంలోని ముఖ్య ప్రాంతాలలో భద్రతను విపరీతంగా పెంచారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com