'ఆకాశంలో ఒక తార' నుంచి బిజిలీగా రుహానీ శర్మ ఫస్ట్ లుక్ రిలీజ్

- October 24, 2026 , by Maagulf
\'ఆకాశంలో ఒక తార\' నుంచి బిజిలీగా రుహానీ శర్మ ఫస్ట్ లుక్ రిలీజ్

దుల్కర్ సల్మాన్, పవన్ సాదినేని, గీతా ఆర్ట్స్ & స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా 'ఆకాశంలో ఒక తార' నుంచి బిజిలీగా రుహానీ శర్మ ఫస్ట్ లుక్ రిలీజ్- నవంబర్ 20, 2026న పాన్ ఇండియా థియేట్రికల్ రిలీజ్

వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న డిఫరెంట్ ఎమోషనల్ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయమవుతుండగా, శ్రుతి హాసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో ముఖ్యమైన పాత్రను మేకర్స్ పరిచయం చేశారు.

ఈ సినిమాలో బిజిలీగా నటిస్తున్న రుహానీ శర్మ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. కిటికీ పక్కన కూర్చుని కనిపిస్తున్న ఆమె సంప్రదాయ దుస్తుల్లో సింపుల్‌గా, అందంగా ఆకట్టుకున్నారు. ప్లజెంట్ ప్రెజెంటేషన్‌లో రుహానీ సహజమైన అందంతో మెరిసింది. బిజిలీ పాత్ర సినిమాలో ఎలాంటి మలుపులు తీసుకొస్తుందనే ఆసక్తిని ఈ ఫస్ట్ లుక్ పెంచుతోంది.

అనుకోని సమయంలో కథలోకి ప్రవేశించి, అప్పటివరకు సాగుతున్న ప్రయాణానికి కొత్త వెలుగును తీసుకొచ్చే పాత్రగా బిజిలీని మేకర్స్ పరిచయం చేశారు. అనుకోకుండా ఎదురయ్యే ఓ పరిచయం.. ఆ ప్రయాణంలో ఊహించని అందమైన అనుభూతులను తీసుకొస్తుంది.

ఇటీవల విడుదలైన ‘ఆకాశంలో ఒక తార’ టీజర్‌కు మంచి ఆసక్తి నెలకొంది. పెద్ద కలలతో ముందుకు సాగాలనుకునే ఓ పల్లెటూరి అమ్మాయి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తన కలలను నిజం చేసుకునే ప్రయాణంలో హీరో ఆమెకు అండగా నిలుస్తాడు. భావోద్వేగాలకు ప్రాధాన్యమిస్తూ, ఆశయాలు, అనుబంధాల నేపథ్యంలో ఈ సినిమా సాగనున్నట్లు టీజర్ సూచించింది.

ఈ చిత్రానికి సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్వేత సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.

‘ఆకాశంలో ఒక తార’ చిత్రాన్ని 2026 నవంబర్ 20న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

నటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్, రుహానీ శర్మ  

సాంకేతిక బృందం
దర్శకత్వం: పవన్ సాధినేని
రచన: గంగరాజు గున్నం
నిర్మాతలు: సందీప్ గున్నం, రమ్య గున్నం
సమర్పణ: గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
ప్రొడక్షన్ డిజైనర్: శ్వేత సాబు సిరిల్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com