డిసెంబర్‌లో అబుదాబిలో అరుదైన లగ్జరీ కార్ల వేలం..!

- October 27, 2026 , by Maagulf
డిసెంబర్‌లో అబుదాబిలో అరుదైన లగ్జరీ కార్ల వేలం..!

అబుదాబి: ప్రపంచంలోనే అత్యంత అరుదైన, విలాసవంతమైన కార్లలో కొన్నింటిని డిసెంబర్ 9న అబుదాబిలో వేలం వేయనున్నారు. ప్రపంచంలోని ప్రముఖ కలెక్షన్ కార్ల వేలం సంస్థ RM Sotheby’s ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ వేలంలో ప్రధానంగా ఫెరారీ కార్లతో పాటు లంబోర్గిని, లాన్సియా వంటి ప్రముఖ బ్రాండ్ల కార్లు కూడా అందుబాటులో ఉండనున్నాయి. మొత్తం ఆరు కార్ల అంచనా ధరలు $80,000 (Dh293,600) నుంచి $850,000 (Dh3.11 మిలియన్లు) వరకు ఉన్నాయి. వీటిలో రెండు కార్లకు కనీస ధరను నిర్ణయించకుండా వేలం నిర్వహించనున్నారు.

అత్యధిక ధర పలకనున్న ఫెరారీ

2009లో తయారైన Ferrari Scuderia Spider 16M ఈ వేలంలో అత్యధిక విలువ కలిగిన కారుగా నిలవనుంది. ఇప్పటివరకు ఈ కారు కేవలం 5,200 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించింది. దీని అంచనా ధర $700,000 నుంచి $850,000 వరకు ఉంది. 
2004 Ferrari 360 Challenge Stradale కారు సుమారు 32,000 కిలోమీటర్లు ప్రయాణించింది. పూర్తి సర్వీస్ చరిత్ర, అసలు పుస్తకాలు, టూల్స్‌తో అందుబాటులోకి రానుంది. దీని అంచనా ధర $450,000 నుంచి $550,000 వరకు ఉంది. 
2010 Ferrari 599 GTB Fiorano కారు 39,900 కిలోమీటర్లు ప్రయాణించింది. ఐవరీ క్రీమ్ రంగు బయటిభాగం, బ్రౌన్ కలర్ ఇంటీరియర్‌తో ప్రత్యేకంగా రూపొందించారు. దీని అంచనా ధర $140,000 నుంచి $200,000 వరకు ఉంది. 
2006 Ferrari 612 Scaglietti F1 HGTC కారు సుమారు 58,000 కిలోమీటర్లు ప్రయాణించింది. ప్రత్యేకమైన పెయింట్, లెదర్ సీట్లు, పూర్తి సర్వీస్ రికార్డులు దీని ప్రత్యేకతలు. దీని అంచనా ధర $80,000 నుంచి $120,000 వరకు ఉంది. ఈ కారును కూడా కనీస ధర లేకుండా వేలం వేయనున్నారు.

లంబోర్గిని, లాన్సియా కార్లపైనా ఆసక్తి

2004 Lamborghini Murciélago కారులో 6.2 లీటర్ల V12 ఇంజిన్, 572 హార్స్‌పవర్ సామర్థ్యం, సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఉన్నాయి. నాలుగు చక్రాలకు పవర్ అందించే ఈ కారు అంచనా ధర $400,000 నుంచి $450,000 వరకు ఉంది. 
1991 Lancia Delta HF Integrale Evoluzione “Martini 5”. లాన్సియా వరుసగా ఐదోసారి వరల్డ్ ర్యాలీ ఛాంపియన్‌షిప్ తయారీదారుల టైటిల్ గెలిచిన సందర్భంగా తయారుచేసిన 400 కార్లలో ఇది 388వ కారు. ప్రత్యేకమైన మార్టిని స్ట్రైప్స్‌తో కనిపించే ఈ కారుకు 2022 మేలో విస్తృతమైన పునరుద్ధరణ పనులు చేశారు. దీని అంచనా ధర $120,000 నుంచి $150,000 వరకు ఉంది. దీనిని కూడా కనీస ధర లేకుండా వేలం వేయనున్నారు.

కలెక్టర్లకు ప్రత్యేక అవకాశం

మిడిలిస్టులో అరుదైన కార్ల మార్కెట్ వేగంగా ఆసక్తిని పెంచుకుంటోందని RM Sotheby’s మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా మేనేజింగ్ డైరెక్టర్ డుచియో ఫిలిప్పో లోప్రెస్టో తెలిపారు. కార్ల చరిత్ర, తయారీ నైపుణ్యం, ప్రత్యేకతలను ఇష్టపడే పాత, కొత్త కలెక్టర్లను ఈ వేలం ఆకర్షిస్తుందని ఆయన పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com