చైనాలో భారీ మోసం....
- August 27, 2016
షెంజెన్: బాబాల పేరుతో మోసం చేసిన వారి గురించి విన్నాం.. మంత్రులు, ముఖ్యమంత్రులు, పెద్దపెద్దవాళ్లు తెలుసంటూ డబ్బుకాజేసిన ఘటనలు చూశాం. కానీ వందల ఏళ్ల క్రితం దేశాన్ని పాలించిన రాజునంటూ, ఇంకా బతికే ఉన్నానంటూ మోసం చేయడం ఎక్కడైనా విన్నారా.. వినడానికి విచిత్రంగా ఉన్నా అదే జరిగింది చైనాలో. తాను 300ఏళ్ల నాటి రాజునంటూ.. ఓ సంపన్నురాలిని మోసం చేసి దాదాపు రూ.47కోట్లు కాజేశాడో వ్యక్తి. అసలేం జరిగిందంటే..గువాన్‌డాంగ్ ప్రావిన్స్‌కు చెందిన జెంగ్ షుజు అనే మహిళ 2012లో ఓ వ్యాపారం ప్రారంభించింది.తన కంపెనీలో పెట్టుబడులు పెట్టే వారి ని ఆహ్వానించగా.. వాన్ జియాన్‌మిన్ అనే వ్యక్తి కలిశాడు. తాను ఫైనాన్షియర్‌నని చెప్పి.. కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పుకున్నాడు. అంతా బాగానే ఉంది కానీ, కొన్ని రోజుల తర్వాత జెంగ్‌కు వాన్ ఓ వ్యక్తిని స్నేహితుడంటూ పరిచయం చేశాడు. అతడి పేరు క్వియన్‌లాంగ్. 1735 నుంచి 1796 వరకు చైనాను పాలించిన రాజు క్వియన్‌లాంగ్. అయితే తానే ఆ రాజునని.. 300ఏళ్లుగా బతికే ఉన్నానని వాన్ స్నేహితుడు జెంగ్‌కు చెప్పాడు. అమృతం తీసుకోవడం వల్లే తాను ఇన్నేళ్లు బతికానని చెప్పుకొచ్చాడు. సాధారణంగా ఇలాంటి విషయాలు నమ్మశక్యంగా ఉండవు. అయితే వాన్, అతడి స్నేహితుడు కలిసి జెంగ్‌కు మాయమాటలు చెప్పి నమ్మించారు. అంతేగాక, తన రాజప్రసాదంలో భారీగా నిధులున్నాయని, వాటిని తీసుకొచ్చేందుకు సాయం చేయాలని చెప్పారు.వింతేంటంటే.. వారి మాటలను జెంగ్ నమ్మడమేగాక, రాజ ప్రసాదంలో సొమ్మును విడిపించేందుకు 2 మిలియన్ యువాన్లు కూడా ఇచ్చింది. అంతేగాక, 2014లో షెంజెన్‌లో ఓ టెక్నాలజీ సంస్థ పెట్టేందుకు వారికి 45 మిలియన్ యువాన్లు ఇచ్చింది. అయితే మొత్తం 47 మిలియన్ యువాన్ల(భారత కరెన్సీలో దాదాపు రూ. 47కోట్లు) డబ్బుతో వాన్, అతడి స్నేహితుడు పరారయ్యారు. దీంతో సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. దాదాపు ఏడాది తర్వాత వారిని పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







