'తులాభారం'.. తన ఫస్ట్ డే షూట్ లో జాయిన్ అయిన హీరో రవితేజ
- October 28, 2026
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబినేషన్ లో మోస్ట్ ఎవైటెడ్ మూవీ తులాభారం. రవితేజ ట్రేడ్‌మార్క్ ఎనర్జీ, వివేక్ ఆత్రేయ యూనిక్ స్టయిల్ స్టోరీ టెల్లింగ్ కలగలిసి క్రైమ్, డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సరికొత్త అనుభూతిని అందించనున్నాయి. బ్లాక్‌బస్టర్ ‘ఇరుముడి’ విజయంతో జోరు మీదున్న రవితేజ.. ఈ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లక్ష్మణ్, శ్రీనిరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తునారు.
తులాభారం ‘ది టైటిల్ డాక్యుమెంటరీ’ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రవితేజ తనదైన ఎనర్జీ, పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ‘మాస్ మహారాజా’గా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అయితే ‘తులాభారం’తో ఆయన సరికొత్త ఐడెంటిటీ ని సొంతం చేసుకోబోతున్నారు. ఇందులో ‘మాస్ మహారాజా’కు బదులుగా ‘క్రైమ్ మహారాజా’గా పరిచయం అవుతున్నారు. ‘నవ రవితేజం’గా కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ విడుదల చేసిన టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో సినిమాపై అంచనాలను పెంచింది.
తులాభారం షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైయింది. తాజాగా హీరో రవితేజ తన ఫస్ట్ డే షూట్ లో జాయిన్ అయ్యారు. ఆయనతోపాటు కీలక నటినటులు షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్, ప్రియాంక మోహన్, అనస్వర రాజన్, జేడీ చక్రవర్తి, అనిల్ కరెళ్ల, రవి ఆంటోనీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం పనిచేస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. తేని ఈశ్వర్ ISC సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటర్‌గా, జీఎం శేఖర్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
నటీనటులు: మాస్ మహారాజా రవితేజ, తరుణ్ భాస్కర్, ప్రియాంక మోహన్, అనస్వర రాజన్, జేడీ చక్రవర్తి, అనిల్ కరెళ్ల, రవి ఆంటోనీ
సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
నిర్మాతలు: లక్ష్మణ్, శ్రీనిరావు
బ్యానర్: బ్రిడ్జ్ ప్రొడక్షన్స్
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: తేని ఈశ్వర్ ISC
ఎడిటర్: రవితేజ గిరిజాల
ఆర్ట్ డైరెక్టర్: జీఎం శేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్. నరసింహారావు
కాస్ట్యూమ్ డిజైనర్: నాని కమార్సు
మేకప్ చీఫ్: ఐ. శ్రీనివాసరాజు
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్
తాజా వార్తలు
- Dubai Police and Meta Join Forces to Raise Cybersecurity Awareness and Tackle Digital Fraud
- వరద సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు
- చమురు లీకేజీ ప్రభావం..షార్జాలో అన్ని బీచ్‌లు తాత్కాలికంగా మూసివేత
- జయేశ్ రంజన్ బదిలీ
- ఏపీకి మరో 7 రోజుల పాటు భారీ వర్ష సూచన
- 13th Sharjah International Travel & Tourism Forum opens
- యూఏఈలో ఆరోగ్య రంగ ప్రముఖులకు ఘన సత్కారం
- రక్షణ రంగంలో సహకారంపై సౌదీ, ఇటలీ చర్చలు..!!
- ఒమన్‌లో ఇద్దరు ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- కువైట్‌లో విదేశీ ఇంజినీర్లకు ఊరట..!!







