కువైట్‌లో విదేశీ ఇంజినీర్లకు ఊరట..!!
- October 28, 2026
కువైట్: కువైట్‌లో ఇంజినీరింగ్ వృత్తుల్లో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (PAM) ఊరటనిచ్చింది. ఇంజినీరింగ్ విద్యార్హతల సమానత్వం, గుర్తింపు (Equivalency and Accreditation) ప్రక్రియ పూర్తి చేసుకునేందుకు గడువును 2028 జూన్ 30 వరకు పొడిగించింది. ఈ మేరకు జారీ చేసిన సర్క్యులర్ నంబర్ 5 ఆఫ్ 2026లో వివరాలు వెల్లడించింది. గతంలో విద్యార్హతల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసుకునేందుకు మినహాయింపు పొందినప్పటికీ, ఇంకా అవసరమైన ప్రక్రియను పూర్తి చేయని ఇంజినీర్లకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. వారి వర్క్ పర్మిట్ల గడువు 2028 జూన్ 30లోపు ముగిసే సందర్భాల్లో ఈ పొడిగింపు వర్తించనుంది.
సాహెల్ యాప్ ద్వారా ఆమోదం తప్పనిసరి
ఈ గడువు పొడిగింపును వినియోగించుకోవాలనుకునే ఉద్యోగులు ప్రభుత్వ సాహెల్ (Sahel) యాప్‌లో నిర్దేశించిన లింక్ ద్వారా జతచేసిన డిక్లరేషన్‌కు ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఆమోదం తెలపాల్సి ఉంటుందని PAM స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ పూర్తిచేస్తే నిబంధనలకు అనుగుణంగా ఇంజినీరింగ్ వృత్తులకు సంబంధించిన వర్క్ పర్మిట్లను జారీ చేయించుకోవడం లేదా రెన్యువల్ చేసుకోవడం సాధ్యమవుతుంది.
గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలి
పొడిగించిన గడువులోగా ఇంజినీరింగ్ విద్యార్హతల సమానత్వం, గుర్తింపు ప్రక్రియలను తప్పనిసరిగా పూర్తి చేయాలని PAM సూచించింది. నిర్దేశిత సమయంలోగా నిబంధనలు పాటించని వారిపై సంబంధిత చట్టాలు, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- రక్షణ రంగంలో సహకారంపై సౌదీ, ఇటలీ చర్చలు..!!
- ఒమన్‌లో ఇద్దరు ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- కువైట్‌లో విదేశీ ఇంజినీర్లకు ఊరట..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక టవర్..!!
- పెట్టుబడుల ద్వారా దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధిపై ఖతార్ ఫోకస్..!!
- భారీ వర్షాలకు సిద్ధమవుతోన్న బహ్రెయిన్..!!
- నవంబర్ 1 నుంచి దుబాయ్‌లో వైల్డ్ వాడీ వాటర్‌పార్క్ ప్రారంభం..
- ఆసియా పారా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ యాదవ్ బలవన్మరణం
- కలలకు ఊపిరి పోయండి...మత్తుకు కాదు 2029 లోగానే నషా ముక్త్ తెలంగాణే లక్ష్యం
- విజయం పై నెతన్యాహు ధీమా వ్యక్తం







