ఒమన్‌లో ఇద్దరు ఆసియా దేశస్థుల అరెస్ట్‌..!!

- October 28, 2026 , by Maagulf
ఒమన్‌లో ఇద్దరు ఆసియా దేశస్థుల అరెస్ట్‌..!!

మస్కట్‌: ఒమన్‌లోని సోహార్‌ ప్రాంతంలో నగదు, విలువైన వస్తువులతో కూడిన బ్యాగును చోరీ చేసిన ఇద్దరు ఆసియా దేశస్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నార్త్‌ అల్‌ బతీన్హా పోలీస్‌ కమాండ్‌ అధికారులు ఈ మేరకు ప్రకటించారు. సోహార్‌ విలాయత్‌లోని ఓ రెస్ట్‌ హౌస్‌ నుంచి నగదు, విలువైన వస్తువులు ఉన్న బ్యాగును నిందితులు దొంగిలించినట్లు పేర్కొన్నారు. ఈ చోరీకి సంబంధించి పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుల జాతీయత, చోరీకి గురైన నగదు విలువ, ఇతర వస్తువుల వివరాలను అధికారులు వెల్లడించలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com