సౌదీ వింటర్ ఈవెంట్స్ క్యాలెండర్ ఆవిష్కరణ..!!
- October 29, 2026
రియాద్: సౌదీ అరేబియాలో శీతాకాల పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో పర్యాటక శాఖ మంత్రి అహ్మద్ అల్ ఖతీబ్ ఈ ఏడాది ‘సౌదీ వింటర్’ ఈవెంట్స్ క్యాలెండర్‌ను ప్రారంభించారు. ‘మీకు నచ్చిన రీతిలో సౌదీ వింటర్’ అనే థీమ్‌తో దేశంలోని 9 ప్రధాన ప్రాంతాల్లో వివిధ పర్యాటక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రియాద్, అల్ ఉలా, అల్ ఖాసిమ్, హాయిల్, జెడ్డా, అల్ ఖోబర్, అల్ అహ్సా, మదీనా, రెడ్ సీ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. కుటుంబాలు, స్నేహితులు, వివిధ వయసుల పర్యాటకులు తమ అభిరుచులకు అనుగుణంగా పర్యటనలను ప్రణాళిక చేసుకునేలా ఈ క్యాలెండర్‌ను రూపొందించారు.
ఈ కార్యక్రమాల్లో ఉత్సవాలు, క్రీడా పోటీలు, ప్రత్యక్ష వినోద ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చారిత్రక ప్రదేశాల సందర్శనలు, ప్రకృతి విహారాలు, ఎడారి సాహస యాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. వీటితోపాటు రిసార్టుల్లో బస, విభిన్న వంటకాల రుచులు, కేఫ్‌లు, షాపింగ్, సముద్ర తీర ప్రాంతాల్లో వినోద కార్యక్రమాలకు కూడా అవకాశం కల్పించనున్నారు. ఈ ఏడాది సౌదీ వింటర్ కార్యక్రమం కోసం సౌదీ టూరిజం అథారిటీ గతంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన 100 మందికి పైగా భాగస్వాములు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 1,800కు పైగా పర్యాటక ఉత్పత్తులు, సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు.
దేశంలోని పర్యాటక ప్రాంతాల ఆకర్షణను పెంచడం, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడం, పర్యాటక రంగంలో పోటీతత్వాన్ని బలోపేతం చేయడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యాలని అధికారులు పేర్కొన్నారు. సౌదీ వింటర్ ఈవెంట్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను పర్యాటక మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో ముందుగానే ఫ్లూ వ్యాక్సిన్‌కు బుకింగ్స్..!!
- కువైట్ లో వర్షం.. హజార్డ్ లైట్ల వినియోగంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో డిస్కౌంట్ ఆఫర్లకు కొత్త నిబంధనలు..!!
- ఖతార్‌లో మై ఆపిల్ రెస్టారెంట్ పై కొరడా..!!
- బహ్రెయిన్‌లోని రెండు చారిత్రక కట్టడాలకు అరుదైన గుర్తింపు..!!
- సౌదీ వింటర్ ఈవెంట్స్ క్యాలెండర్ ఆవిష్కరణ..!!
- కేదార్‌నాథ్‌లో భారీగా కురుస్తున్న మంచు.. యాత్రికులకు కీలక సూచన
- అయ్యప్ప భక్తులకు రూ.5 లక్షల బీమా
- తొలిసారిగా టచ్‌స్క్రీన్‌తో ఆపిల్ మ్యాక్‌బుక్ ప్రో.. 24 గంటల బ్యాటరీ లైఫ్!
- తుపాను బాధితులకు 25 కేజీల బియ్యం: సీఎం చంద్రబాబు







